News January 16, 2025

KL రాహుల్, శాంసన్‌కు షాక్?

image

ఛాంపియన్స్ ట్రోఫీలో WKలుగా KL రాహుల్, శాంసన్‌కు ఛాన్స్ దక్కకపోవచ్చని వార్తలొస్తున్నాయి. రాహుల్‌ను స్పెషలిస్ట్ WKగా ఆడించేందుకు సెలక్టర్లు ఆసక్తిగా లేరని, VHTలో ఆడకపోవడంతో శాంసన్ ఈ ఛాన్స్ కోల్పోయినట్లు నేషనల్ మీడియా పేర్కొంది. WK స్థానానికి పంత్, జురెల్ ఎంపికవ్వొచ్చని అంచనా వేసింది. రానున్న రోజుల్లో శాంసన్ T20ల్లో, పంత్&జురెల్ టెస్ట్, ODIల్లో కొనసాగుతారని తెలిపింది. దీనిపై త్వరలో స్పష్టత రానుంది.

Similar News

News October 22, 2025

గాయిటర్ గురించి తెలుసా?

image

థైరాయిడ్‌ గ్రంథి అసాధారణ సైజుకు పెరగడాన్ని గాయిటర్‌ అంటారు. ఇది రెండు రకాలు. థైరాయిడ్‌ గ్రంథి ఉబ్బడాన్ని డిఫ్యూస్‌ గాయిటర్‌ అని, థైరాయిడ్‌ గ్రంథిలో గడ్డలు పెరిగితే నాడ్యులార్‌ గాయిటర్‌ అని అంటారు. గొంతు దగ్గర బాగా ఉబ్బినట్లుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. కొందరిలో మాత్రం థైరాయిడ్‌ హార్మోన్ల స్రావంలో హెచ్చుతగ్గులు వస్తాయి. నిర్ధారణ కోసం థైరాయిడ్‌ ప్రొఫైల్‌ పరీక్షలైన T3, T4, TSH, NFAC చేస్తారు.

News October 22, 2025

గాయిటర్ చికిత్స

image

థైరాయిడ్‌ గ్రంథి అయోడిన్‌ను గ్రహించి దాన్ని థైరాయిడ్‌ హార్మోన్లుగా మారుస్తుంది. అయోడిన్‌ లోపిస్తే గాయిటర్‌ జబ్బు వస్తుంది. థైరాయిడ్‌ సమస్య నిర్ధారణ కోసం చేసే పరీక్షల ఫలితాల ఆధారంగా గాయిటర్‌ చికిత్సకు ఎండోక్రైనాలజిస్ట్‌ ఆధ్వర్యంలో తగిన చికిత్స చేస్తారు. థైరాయిడ్‌ వ్యవస్థను సరిచేయడం ద్వారా కొంతమందిలో గాయిటర్‌ తగ్గుముఖం పడుతుంది. సాధారణంగా దీన్ని ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండానే నయం చేయవచ్చు.

News October 22, 2025

ఇతిహాసాలు క్విజ్ – 43 సమాధానాలు

image

1. జనకుని తమ్ముడి పేరు కుశధ్వజుడు.
2. కుంతీ కుమారుల్లో పెద్దవాడు ‘కర్ణుడు’.
3. ఊర్ధ్వ లోకాలలో మొదటి లోకం భూలోకం.
4. విష్ణువు చేతిలో ఉండే చక్రం పేరు ‘సుదర్శన చక్రం’.
5. దేవాలయాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించేటప్పుడు వాటికి జీవం పోసే ఆచారం/వేడుకను ‘ప్రాణ ప్రతిష్ఠ’ అని అంటారు.
<<-se>>#Ithihasaluquiz<<>>