News March 22, 2024
RCBకి షాక్

CSKతో జరుగుతున్న ఆరంభ మ్యాచులో RCBకి బిగ్ షాక్ తగిలింది. చెన్నై బౌలర్ ముస్తాఫిజుర్ విజృంభించి ఏకంగా 4 వికెట్లు పడగొట్టారు. దీంతో RCB 12 ఓవర్లకే 78 పరుగులకు 5 కీలక వికెట్లు కోల్పోయింది. డుప్లెసిస్ (35), కోహ్లీ(21), గ్రీన్(18), రజత్ పాటీదార్, మ్యాక్స్‌వెల్ డకౌట్ అయ్యారు.
Similar News
News November 15, 2025
బిహార్‌లో ‘నిమో’ డబుల్ సెంచరీ

బిహార్‌లో ఎన్నికల్లో నిమో(నితీశ్-మోదీ) ఆధ్వర్యంలోని NDA డబుల్ సెంచరీ కొట్టింది. 243 స్థానాలకు గానూ 203 సీట్లు కైవసం చేసుకుంది. BJP 90 స్థానాల్లో, JDU 85 చోట్ల, LJP 19 నియోజకవర్గాల్లో విజయం సాధించాయి. HAM-5, RLM-4 సీట్లు కైవసం చేసుకున్నాయి. అటు కాంగ్రెస్-RJD నేతృత్వంలోని మహాగఠ్ బంధన్ ఇప్పటివరకు 34 సీట్లకే పరిమితం అయింది. ఆర్జేడీ 24, INC-6 సీట్లు గెలుచుకున్నాయి.
News November 14, 2025
పడుకునే ముందు ఇవి తినవద్దు!

చాలా మంది లేట్ నైట్ పడుకునే ముందు కొన్ని రకాల స్నాక్స్, అన్‌హెల్దీ ఫుడ్ లాగించేస్తుంటారు. అది ఏమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా పిజ్జా, బర్గర్స్, ఐస్‌క్రీమ్స్, కేక్స్, కూల్‌డ్రింక్స్ తీసుకోవద్దని చెబుతున్నారు. ఇవి జీర్ణ సంబంధిత సమస్యలకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. అలాగే చికెన్, మటన్ తీసుకోవడం వల్ల అజీర్తితో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. రాత్రివేళ లైట్ ఫుడ్ తీసుకుంటే బెటర్.
News November 14, 2025
పరకామణి కేసు.. అతడిది హత్యే!

AP: తిరుమల పరకామణి కేసులో <<18284340>>మృతి<<>> చెందిన మాజీ AVSO సతీశ్‌ది హత్యేనని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతపురం సర్వజన ఆసుపత్రిలో ఫోరెన్సిక్, పోలీసుల పర్యవేక్షణలో మృతదేహానికి సిటీ స్కాన్ చేయగా అతడి తల వెనుక గొడ్డలి తరహా ఆయుధంతో నరికినట్లు గుర్తించారు. పరకామణి కేసులో ఫిర్యాదుదారు అయిన సతీశ్ CID ముందు రెండోసారి విచారణకు వస్తూ హత్యకు గురయ్యారు. కోమలి రైల్వే పట్టాల సమీపంలో ఆయన శవమై కనిపించారు.


