News October 21, 2024

RCBకి షాక్.. కర్ణాటక ప్లేయర్ల కోసం ప్రభుత్వం ఒత్తిడి?

image

IPL-2025 వేలానికి ముందు RCBకి కొత్త సమస్య వచ్చింది. ఆ జట్టులోని కర్ణాటక ఆటగాళ్లు విజయ్ కుమార్, మనోజ్ భాండాగేను రిటైన్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. స్థానిక ఆటగాళ్లను ఎక్కువగా తీసుకోవాలని కోరుతోందని వార్తలు వస్తున్నాయి. దీనివల్ల తమ ప్రణాళికలు దెబ్బతింటాయని యాజమాన్యం భావిస్తోంది. కాగా RCB కోహ్లీ, సిరాజ్, మ్యాక్సీ, గ్రీన్, రజత్‌లను అట్టిపెట్టుకోనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News January 29, 2026

కరుంగలి మాల ఎందుకు ధరించాలంటే…?

image

కరుంగలి మాల ఆభరణమే కాదు! శక్తిమంతమైన రక్షణ కవచం కూడా. ఇది ప్రతికూల శక్తులను, చెడు దృష్టిని దరిచేరనీయదు. కుజ దోషం ఉన్నవారు దీనిని ధరిస్తే ఆటంకాలు తొలగి విజయం లభిస్తుంది. మానసిక ఒత్తిడి, భయం, సోమరితనాన్ని తగ్గించి మనశ్శాంతి ప్రసాదిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునే వారు, ఆర్థిక ఇబ్బందుల ఎదుర్కొంటున్నవారు ఈ పవిత్రమైన మాలను ధరించడం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారని సిద్ధ సంప్రదాయం చెబుతోంది.

News January 29, 2026

రెండు రోజుల లాభాలకు బ్రేక్

image

అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ రెండు రోజుల లాభాల అనంతరం దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో మొదలయ్యాయి. ఇన్వెస్టర్లు అమ్మకాల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో సెన్సెక్స్ 250 పాయింట్లకు పైగా కోల్పోయి 82,093 వద్ద, నిఫ్టీ 68 పాయింట్లు నష్టపోయి 25,274 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడమూ భారత మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.

News January 29, 2026

వడ్డీ రేట్లు యథాతథం: US FED

image

వడ్డీ రేట్ల విషయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం తీసుకుంది. 3.5%-3.75%గా ఉన్న వడ్డీరేట్లను అలాగే కొనసాగించనున్నట్లు ప్రకటించింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ తెలిపారు.