News January 15, 2025

సిద్ద రామ‌య్య‌కు షాక్‌.. ముడా స్కాంలో విచార‌ణ కొన‌సాగింపు

image

ముడా స్కాం కేసులో CM సిద్ద రామ‌య్య‌పై మైసూరు లోకాయుక్త పోలీసులు విచార‌ణ కొన‌సాగించ‌వ‌చ్చ‌ని క‌ర్ణాట‌క హైకోర్టు ఆదేశాలిచ్చింది. గ‌తంలో ఈ కేసు విచార‌ణ‌పై ఇచ్చిన మ‌ధ్యంత‌ర స్టేను తాజాగా ఎత్తేసింది. Jan 27లోపు విచార‌ణ నివేదిక‌ను స‌మ‌ర్పించాల‌ని జ‌స్టిస్ ఎం.నాగ‌ప్ర‌సన్న ఆదేశించారు. అంత‌కంటే ముందు ఈ కేసుకు సంబంధించి గత ఏడాది Dec 19 నుంచి సేకరించిన అన్ని ఫైల్స్‌ను గురువారంలోపు అంద‌జేయాల‌ని ఆదేశించారు.

Similar News

News December 9, 2025

కరీంనగర్: ఉప సర్పంచ్ కుర్చీకి రూ.5- 10 లక్షలు..?

image

పంచాయతీల్లో ఉప సర్పంచ్ పదవికి డిమాండ్ భారీగా పెరిగింది. దీనికి కారణం జాయింట్ చెక్ పవర్ ఉండటమే. ఈ కుర్చీని దక్కించుకోవడానికి ఆశావహులు వార్డు మెంబర్ స్థానంలో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. మేజర్ పంచాయతీల్లో ఈ పదవి కోసం ఏకంగా రూ.5 నుంచి 10 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. వార్డు సభ్యులను తమవైపు తిప్పుకోవడానికి నగదు ఆఫర్లు, రహస్య ఒప్పందాలు జరుగుతున్నాయనే ప్రచారం స్థానికంగా ఎన్నికల వేడిని రాజేస్తోంది.

News December 9, 2025

టీ20ల్లో మనదే డామినేషన్.. కానీ!

image

టీ20ల్లో ఓవరాల్‌గా దక్షిణాఫ్రికాపై టీమ్ ఇండియా డామినేషన్ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 31 T20 మ్యాచులు జరగగా భారత్ 18, SA 12 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఒక మ్యాచులో ఫలితం రాలేదు. అయితే సొంతగడ్డపై ఆడిన 12 మ్యాచుల్లో ఇండియా ఐదింట్లో నెగ్గగా దక్షిణాఫ్రికా ఆరు మ్యాచుల్లో గెలిచింది. మరో మ్యాచ్‌లో రిజల్ట్ రాలేదు. కాగా కటక్‌లో ఆడిన రెండు టీ20ల్లో దక్షిణాఫ్రికానే విజయం సాధించడం గమనార్హం.

News December 9, 2025

ఎర్లీ ప్యూబర్టీ ఎందుకొస్తుందంటే?

image

పిల్లలు త్వరగా యవ్వన దశకు చేరుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. కుటుంబ చరిత్ర, ఆహారపు అలవాట్లు, అధికబరువు, కొన్ని రకాల కాస్మెటిక్స్, సబ్బులు, డిటర్జెంట్లలో ఉండే పారాబెన్స్, ట్రైక్లోసాన్, ఫ్తాలేట్స్ వంటి రసాయనాలు హార్మోన్ల పనితీరును దెబ్బతీస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే ఇంట్లో వండిన ఆహారాన్నే తినడం, రసాయనాల వాడకాన్ని తగ్గించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం మంచిదని సూచిస్తున్నారు.