News August 1, 2024
శ్రీలంకకు షాక్.. వన్డే సిరీస్ నుంచి పతిరణ ఔట్

భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు శ్రీలంకకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ పతిరణ గాయం కారణంగా వన్డే సిరీస్‌కు దూరమయ్యారు. టీమ్ ఇండియాతో జరిగిన చివరి T20లో పతిరణ భుజానికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో 2 వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో ఆయన సిరీస్ నుంచి వైదొలిగారు. పతిరణ స్థానంలో అన్‌క్యాప్డ్ ప్లేయర్ షిరాజ్‌ను ఎంపిక చేశారు. మరో పేసర్ మధుశంక కూడా సిరీస్‌కు దూరమయ్యారు.
Similar News
News April 1, 2026
కస్టమర్లకు ఈరోజు బ్యాంక్ సేవలు దూరం

తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులు ఈరోజు బ్రాంచ్ సేవలను నిలిపివేశాయి. ఆర్థిక సంవత్సర ముగింపునకు సంబంధించిన పనులను పూర్తి చేయాల్సిన నేపథ్యంలో కస్టమర్లకు ఈరోజు బ్యాంకులు అందుబాటులో ఉండవు. అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎంలు వంటి సేవలు కొనసాగుతాయి. రేపు యథావిధిగా బ్యాంకులు కొనసాగనుండగా గుడ్ ఫ్రైడే సందర్భంగా ఎల్లుండి మళ్లీ సెలవు ఉంటుంది.
News April 1, 2026
రాష్ట్రంపై క్యాన్సర్ పంజా..!

TG: రాష్ట్రంలో ఈ ఏడాది చివరి నాటికి 46,762 క్యాన్సర్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ICMR నివేదిక పేర్కొనడం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో పురుషులు 21,252 మంది కాగా.. మహిళలు 25,510 మంది ఉన్నారు. పొగాకు వల్లే పురుషుల్లో 58.8%, మహిళల్లో 29.7% క్యాన్సర్లు వస్తున్నాయి. ఇక HYDలో ప్రతీ ఆరుగురు మహిళల్లో ఒకరికి ముప్పు ఉంది. పురుషుల్లో ఓరల్, మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంది.
News April 1, 2026
ఇవాళ్టి నుంచి చికెన్ షాపులు బంద్

తెలంగాణలో కోడి మాంసం ప్రియులకు బ్యాడ్‌న్యూస్. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ పెంచాలనే డిమాండ్‌తో రిటైల్ యజమానులు నేటి నుంచి చికెన్ షాపులు క్లోజ్ చేశారు. గతంలో మార్జిన్ కేజీకి రూ.26 ఇవ్వగా ఇటీవల పౌల్ట్రీలు దాన్ని రూ.16కు తగ్గించాయి. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఓనర్స్ అంటున్నారు. మార్జిన్‌ను రూ.30కి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసన నేపథ్యంలో చికెన్ దుకాణాలు 2-3 రోజుల వరకు మూతపడే అవకాశం ఉంది.


