News March 21, 2024

స్టార్ క్రికెటర్లకు షాక్

image

పొట్టి ఫార్మాట్ క్రికెట్‌లో అదరగొడుతోన్న బాబర్ ఆజం, డేవిడ్ వార్నర్, జేసన్ రాయ్, టిమ్ డేవిడ్, మహ్మద్ రిజ్వాన్‌కు షాక్ తగిలింది. ఇంగ్లండ్‌లో జరిగే ది హండ్రెడ్ లీగ్-2024 వేలంలో వీళ్లని కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ముందుకు రాలేదు. విండీస్ ఆటగాళ్లు నికోలస్ పూరన్, ఆండ్రూ రస్సెల్, హెట్‌మెయిర్‌ ఫస్ట్ రౌండ్‌లోనే అమ్ముడుపోయారు. మహిళల విభాగంలో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్, జెమీమా, దీప్తి శర్మను ఎవరూ తీసుకోలేదు.

Similar News

News July 5, 2024

బ్రిటన్ కొత్త ప్రధానిగా నియమితులైన స్టార్మర్

image

బ్రిటన్ ఎన్నికల్లో విజయం సాధించిన లేబర్ పార్టీ అభ్యర్థి కైర్ స్టార్మర్ ప్రధానిగా నియమితులయ్యారు. బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు ఆహ్వానించిన బ్రిటన్ రాజు ఛార్లెస్ స్టార్మర్‌ను ప్రధానిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. లేబర్ పార్టీ నుంచి పీఎంగా ఎన్నికైన ఏడో వ్యక్తిగా స్టార్మర్ నిలిచారు. లండన్‌లోని డౌనింగ్ స్ట్రీట్‌లో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో స్టార్మర్ ఆయన సతీమణితో కలిసి పాల్గొననున్నారు.

News July 5, 2024

నిన్నటి ఈవెంట్ బీసీసీఐకి ఓ స్ట్రాంగ్ మెసేజ్: ఆదిత్య ఠాక్రే

image

నిన్న ముంబైలో జరిగిన T20 వరల్డ్ కప్ విజయోత్సవం ముంబై నుంచి WC ఫైనల్‌ను తీసివేయొద్దనే ఓ స్ట్రాంగ్ మెసేజ్‌ని బీసీసీఐకి ఇచ్చాయని శివసేన(UBT) నేత ఆదిత్య ఠాక్రే ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ గత ఏడాది వన్డే WC ఫైనల్ ముంబైలో కాకుండా అహ్మదాబాద్‌లో నిర్వహించడం గురించే చేశారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం ఎక్కడ నిర్వహించినా అభిమానులు పోటెత్తేవారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

News July 5, 2024

బాబర్ కెప్టెన్సీపై నిర్ణయం తీసుకోలేదు: PCB ఛైర్మన్

image

T20 WCలో పాక్ ఘోర పరాభవంతో బాబర్ ఆజమ్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో అతడిని కెప్టెన్‌గా తొలగిస్తారంటూ వస్తున్న వార్తలపై PCB ఛైర్మన్ మోసిన్ నఖ్వీ స్పందించారు. భవిష్యత్తులో కెప్టెన్‌‌గా బాబర్ కొనసాగడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. దీనిపై త్వరలోనే కోచ్ కిర్‌స్టెన్, మాజీ ఆటగాళ్ల అభిప్రాయం తీసుకుంటామని చెప్పారు. జట్టుకు ‘మేజర్ సర్జరీ’ అవసరమంటూ WCలో ఓటమి అనంతరం నఖ్వీ వ్యాఖ్యానించారు.