News February 7, 2025

TCS ఉద్యోగులకు షాక్.. వేరియబుల్ పేలో భారీ కోత

image

ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ సీనియర్ ఉద్యోగులకు షాకిచ్చింది. 2024-25 Q3లో వారి వేరియబుల్ పేలో భారీ కోత పెట్టినట్లు నేషనల్ మీడియా పేర్కొంది. ఆఫీసుకు వచ్చి పనిచేస్తున్నప్పటికీ వరుసగా రెండో క్వార్టర్‌లోనూ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తొలి త్రైమాసికంలో 70 శాతం వేరియబుల్ పే అలవెన్స్ ఇవ్వగా, Q2లో 20-40 శాతానికి పరిమితం చేసింది. తనకు 50K-55K రావాల్సి ఉండగా Q2లో సగం, Q3లో ఇంకా తగ్గిందని ఓ ఉద్యోగి చెప్పారు.

Similar News

News February 7, 2025

మరోసారి.. ఢిల్లీ స్కూళ్లకు ఆగని బాంబు బెదిరింపులు

image

దేశ రాజధాని ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. ఇవాళ ఉదయం మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఢిల్లీతో పాటు నోయిడాలోని పాఠశాలలకు కూడా ఈ థ్రెట్స్ రావడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆయా స్కూళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

News February 7, 2025

ఎవరి ముందూ మోకరిల్లను: తీన్మార్ మల్లన్న

image

TG: తనకింకా షోకాజ్ నోటీసులు రాలేదని కాంగ్రెస్ MLC తీన్మార్ మల్లన్న తెలిపారు. వచ్చినా భయపడేది లేదని తేల్చిచెప్పారు. తీన్మార్ మల్లన్న ఎవరి ముందూ మోకరిల్లడంటూ వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్ తీరు బీసీలందరికీ షోకాజ్ ఇచ్చినట్లుగా ఉంది. దేనికీ నోటీసులు? వాటిని కులగణనలో భాగమైన నాయకులకివ్వాలి. అధిష్ఠానం ఆదేశాల్ని పాటించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. కులగణన అనేది పూర్తిగా జానారెడ్డి నివేదిక’ అని ఆరోపించారు.

News February 7, 2025

మరోసారి SVSC తరహా మూవీ తీయనున్న అడ్డాల?

image

‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’తో మంచి విజయాన్ని దక్కించుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, ఆ తర్వాత మళ్లీ అలాంటి విజయాన్ని అందుకోలేకపోయారు. ముకుంద, నారప్ప ఫర్వాలేదనిపించగా బ్రహ్మోత్సవం, పెదకాపు నిరాశపరిచాయి. దీంతో ఆయన మరోసారి SVSC తరహా కుటుంబ కథను నమ్ముకున్నట్లు తెలుస్తోంది. అక్కాచెల్లెళ్ల మధ్య సాగే భావోద్వేగాలే ఇతివృత్తంగా ‘కూచిపూడి వారి వీధి’ అన్న మూవీని తెరకెక్కిస్తున్నారని సమాచారం.

error: Content is protected !!