News February 14, 2025

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్‌కు షాక్

image

AUSతో జరిగిన రెండు వన్డేల సిరీస్‌ను శ్రీలంక 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇవాళ జరిగిన మ్యాచ్‌లో 174 పరుగుల తేడాతో కంగారూలను చిత్తు చేసింది. అంతకుముందు PAKతో జరిగిన ODI సిరీస్‌నూ ఆస్ట్రేలియా కోల్పోయింది. దీంతో వరుసగా 4 మ్యాచ్‌లు ఓడినట్లయ్యింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ ఫలితాలు ఆ జట్టుకు ఎదురుదెబ్బే. కీలక ఆటగాళ్లు కమిన్స్, హేజిల్ వుడ్, మార్ష్, స్టార్క్ కూడా CTకి దూరమైన విషయం తెలిసిందే.

Similar News

News November 10, 2025

తల్లి పరీక్ష రాస్తుండగా ఏడ్చిన బిడ్డ.. పాలిచ్చిన పోలీసమ్మ!

image

ఓ బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది అంటారు. ఇలాంటి ఘటనే ఒడిశాలో జరిగింది. పరీక్ష రాసేందుకు బిడ్డతో సెంటర్‌కు వచ్చిన ఓ తల్లి.. తన బిడ్డను బయటే ఉంచేసింది. ఆకలితో ఆ శిశువు గుక్కపట్టి ఏడ్వడంతో అక్కడే ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ వెంటనే ఆ బిడ్డను హత్తుకున్నారు. పరీక్ష పూర్తయ్యే వరకూ ఆమె స్వయంగా పాలిచ్చి లాలించారు. కానిస్టేబుల్ చూపిన మాతృప్రేమపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

News November 10, 2025

క్యాన్సర్ చికిత్సలో గేమ్ ఛేంజర్‌గా TAR-200

image

ఎలాంటి చికిత్సకు లొంగని మూత్రాశయ క్యాన్సర్ కణతులను(Tumors) TAR-200 అనే ఔషధ పరికరం 3 నెలల్లోనే కరిగించి అద్భుతాలు సృష్టిస్తోంది. ఇది పాత పద్ధతిలా కాకుండా, ప్రతి 3 వారాలకు నిరంతరంగా కీమో మందును విడుదల చేస్తుంది. మూత్రాశయం తొలగించాల్సిన అవసరం లేకుండా 82% మంది రోగులకు ఈ చికిత్సతో క్యాన్సర్ నయమైంది. క్యాన్సర్ చికిత్సలో గేమ్ ఛేంజర్‌గా నిలిచిన దీనికి FDA ఆమోదం తెలిపింది.

News November 10, 2025

అత్యంత స్వచ్ఛమైన గాలి లభించే నగరాలివే!

image

ప్రస్తుతం చాలా నగరాలను గాలి కాలుష్యం వెంటాడుతోంది. AQI లెవెల్స్ భారీగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో ఏకంగా 500+AQI నమోదవుతోంది. ఈ నేపథ్యంలో ఇండియాలో స్వచ్ఛమైన గాలి లభించే టాప్-5 నగరాలేవో తెలుసుకుందాం. 1. షిల్లాంగ్(మేఘాలయ)-12, 2.అహ్మద్‌నగర్(MH)-25, 3.మధురై(TN)-27, 4. మీరా భయందర్(MH)-29, 5. నాసిక్‌(MH)- 30 ఉన్నాయి. కాగా హైదరాబాద్‌లో 140+ AQI నమోదవుతోంది.