News December 28, 2024
దివ్యాంగులకు షాక్.. సదరం సర్టిఫికెట్ల జారీ నిలిపివేత
AP: సామాజిక పింఛన్ల తనిఖీ పూర్తయ్యే వరకు దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న దివ్యాంగులకు నిరాశ ఎదురుకానుంది. పింఛన్‌దారులలో అనర్హులు ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. దీంతో జనవరి నుంచి మే వరకు పింఛన్ల తనిఖీ చేయనున్నట్లు సమాచారం. తొలుత రూ.15వేలు అందుకునే లబ్ధిదారులకు పరీక్షలు నిర్వహిస్తారట.
Similar News
News December 28, 2024
ఉద్యోగులకు భరోసా ఇవ్వాలని పవన్‌కు వినతి
AP: అన్నమయ్య(D) గాలివీడు MPDO కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. నిన్న జవహర్ బాబుపై దాడి ఘటనపై ఆరా తీశారు. ఈ సందర్భంగా విధుల్లో ఉన్న అధికారులు, ఉద్యోగులకు భరోసా ఇవ్వాలని ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు పవన్‌ను కోరారు. ఉద్యోగులపై దాడులు చేస్తే తీవ్ర చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు.
News December 28, 2024
ఎంపీడీవోపై దాడి.. నిందితులకు రిమాండ్
AP: అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవోపై దాడి కేసులో వైసీపీ నేత సుదర్శన్ రెడ్డికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఆయనతో పాటు ఇతర నిందితులు భయ్యారెడ్డి, వెంకటరెడ్డికి కూడా రిమాండ్ విధించారు. వీరు ముగ్గురిని కడప సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. పరారీలో ఉన్న మరో 12 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. అటు కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న జవహర్‌బాబును డిప్యూటీ సీఎం పవన్ ఇవాళ పరామర్శించారు.
News December 28, 2024
నితీశ్ కోసం ప్రభుత్వ ఉద్యోగం వదులుకున్న తండ్రి❤️
ఆస్ట్రేలియాపై నితీశ్ సెంచరీ శ్రమ వెనుక ఆయన తండ్రి ముత్యాల రెడ్డి కష్టం ఎంతో ఉంది. విశాఖలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ హిందూస్థాన్ జింక్ లో ఆయన ఉద్యోగం చేసేవారు. ఆ సమయంలోనే ఉదయ్‌పూర్‌కు బదిలీ కాగా నితీశ్ క్రికెటర్ కావాలన్న కల నెరవేరదనే ఆలోచనతో మరో ఐదేళ్ల సర్వీస్ ఉండగానే ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వచ్చిన డబ్బులను నితీశ్ కోచింగ్ కు వెచ్చించారు. ఈక్రమంలోనే ఎన్నో ఇబ్బందులు సైతం ఎదుర్కొన్నారు.