News March 26, 2025
యూజర్లకు షాక్: త్వరలో రీఛార్జ్ ధరల పెంపు?

త్వరలో వినియోగదారులకు టెలికామ్ కంపెనీలు బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొబైల్ రీఛార్జ్ ధరలను సవరించేందుకు కంపెనీలు సిద్ధమైనట్లు సెంట్రమ్ ఇన్‌స్టిట్యూషనల్ రీసెర్చ్ నివేదిక తెలిపింది. ఈ ఛార్జీల పెంపు వల్ల టెలికాం కంపెనీలకు మరింత ఆదాయం వస్తుందని అంచనా వేసింది. 2019లో ఓసారి, 2021లో ఓసారి, 2024లో ఒకసారి ఇలా మూడు సార్లు (2019 DECలో, 2021 NOVలో, 2024 JULYలో) టారిఫ్‌లను పెంచాయి.
Similar News
News March 29, 2025
మయన్మార్‌లో మరోసారి భూకంపం

మయన్మార్‌లో మళ్లీ భూకంపం వచ్చింది. ఆ దేశ రాజధాని నేపిడా సమీపంలో భూప్రకంపనలు వచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైనట్లు తెలిపాయి. 24గంటల వ్యవధిలో 15సార్లు ఆ దేశంలో భూమి కంపించినట్లు తెలుస్తోంది. నిన్న 7.7 తీవ్రతతో మయన్మార్, థాయ్‌లాండ్‌లో సంభవించిన భారీ భూకంపానికి 1000 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే.
News March 29, 2025
చెన్నై కెప్టెన్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌పై ఆ టీమ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ‘మేము 50 పరుగుల తేడాతోనే ఓడిపోయాం. ఇదేమీ భారీ మార్జిన్ కాదు’ అని నిన్న గైక్వాడ్ అన్నారు. టీ20లో 50 రన్స్ తేడాతో ఓడిపోవడం అంటే భారీ కాదా? అని ప్రశ్నిస్తున్నారు. కెప్టెన్ మైండ్‌సెటే ఇలా ఉంటే.. గెలవాలన్న కసి జట్టులోని మిగతా ప్లేయర్లకు ఎలా ఉంటుందని నిలదీస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News March 29, 2025
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్

ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నట్లే వాట్సాప్‌లో స్టేటస్ ఫొటోలకు మ్యూజిక్ యాడ్ చేసే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇందులో లైసెన్స్డ్ ట్రాక్స్ మాత్రమే వాడొచ్చు. సొంత పాటలను అప్డేట్ చేస్తామంటే అనుమతించదు. ఈ ఫీచర్ వాడేందుకు వాట్సాప్ ఓపెన్ చేయాలి> న్యూ స్టేటస్ క్లిక్ చేయాలి> ఫొటో/ వీడియో తీసుకోవాలి> పైన మ్యూజిక్ బటన్ నొక్కాలి> మ్యూజిక్ లైబ్రరీ ఓపెన్ అవుతుంది> మీకు నచ్చిన పాట సెలక్ట్ చేసుకోవాలి.