News April 3, 2025
YCP ఎంపీ మిథున్ రెడ్డికి షాక్

AP: మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. రాష్ట్రంలో మద్యం విక్రయాలు, తయారీలో అవకతవకలు జరిగాయని, అందులో మిథున్ పాత్ర ఉందంటూ ఆయనపై కేసు నమోదైంది. దీంతో మిథున్ ముందస్తు బెయిల్ కోసం అప్లై చేశారు. దానిపై ఇవాళ విచారణ చేపట్టిన న్యాయస్థానం బెయిల్ ఇవ్వడం కుదరదంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
Similar News
News October 17, 2025
మైనింగ్ లీజుల్లో వడ్డెర్లకు 15% రిజర్వేషన్‌పై కసరత్తు

AP: మైనింగ్ లీజుల్లో వడ్డెర్లకు 15% రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వం సంకల్పించింది. దీనిపై క్యాబినెట్లో చర్చించేందుకు ప్రతిపాదనలు ఇవ్వాలని మైనింగ్‌పై సమీక్షలో CM CBN అధికారులను ఆదేశించారు. సీనరేజి, ప్రీమియం మొత్తాల్లో వారికి 50% రాయితీ ఇవ్వాలని సూచించారు. తవ్వకాలపై శాటిలైట్ చిత్రాలతో అంచనా వేయాలని చెప్పారు. ఒడిశా మాదిరి వాల్యూ ఎడిషన్ చేస్తే మైనింగ్ ద్వారా ₹30వేల కోట్ల ఆదాయం వస్తుందని సూచించారు.
News October 17, 2025
14,582 పోస్టులు.. ప్రైమరీ కీ విడుదల

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్(CGL)-2025 టైర్-1 పరీక్ష ప్రాథమిక కీని SSC విడుదల చేసింది. అభ్యర్థులు https://ssc.gov.in/ వెబ్‌సైట్ ద్వారా తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి కీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈనెల 19 వరకు కీపై అభ్యంతరాలను తెలపవచ్చు. 14,582 పోస్టులకు సెప్టెంబర్ 12 నుంచి 26 వరకు, అక్టోబర్ 14న ఎగ్జామ్స్ జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 13.5 లక్షల మంది హాజరయ్యారు.
News October 17, 2025
హిందూ అమ్మాయిలు జిమ్‌కు వెళ్లవద్దు: బీజేపీ ఎమ్మెల్యే

మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే గోపిచంద్ పడల్కర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘దయచేసి హిందూ అమ్మాయిలు జిమ్‌కు వెళ్లొద్దు. అక్కడ మీ ట్రైనర్ ఎవరో తెలియదు. మంచిగా మాట్లాడే వ్యక్తిని చూసి మోసపోకండి. అర్థం చేసుకోండి. ఇంట్లోనే యోగా ప్రాక్టీస్ చేసుకోండి’ అని బీడ్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో వ్యాఖ్యానించారు.