News August 12, 2024

SHOCK: చెవిలో ఫోన్, చంకలో హీటర్..

image

TG: ఫోన్ మాట్లాడుతూ పరధ్యానంగా ఉండటం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ఖమ్మంకు చెందిన మహేశ్(40) స్థానికంగా కొబ్బరికాయల వ్యాపారం చేస్తున్నారు. నిన్న రాత్రి వాటర్ హీటర్ ఆన్ చేస్తున్న సమయంలో కాల్ వచ్చింది. హీటర్‌ను చంకలో పెట్టుకుని స్విచ్ ఆన్ చేశారు. దీంతో విద్యుదాఘాతానికి గురయ్యారు. కుటుంబీకులు ఆస్పత్రికి తరలించేలోపే కన్నుమూశారు. ఫోన్ వాడే సమయంలో అప్రమత్తంగా ఉండాలి.

Similar News

News November 17, 2025

గుంటూరు సౌత్ డివిజన్‌లో ప్రమాద ప్రాంతాల పరిశీలన

image

గుంటూరు సౌత్ సబ్-డివిజన్ డీఎస్పీ భానోదయ 12 ప్రమాద ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) నల్లపాడు, ప్రతిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పరిశీలించారు. లైటింగ్, హెచ్చరిక బోర్డులు, సీసీటీవీలు, వేగ నియంత్రణ చర్యలపై అధికారులతో సమీక్ష జరిపారు. పరిశీలన ఆధారంగా ప్రత్యేక రిపోర్టును ఎస్పీ వకుల్ జిందాల్, NHAIకు పంపనున్నట్లు తెలిపారు. ఎంవీఐ మల్లేశ్వరి, NHAI ఇంజినీర్ దత్తాత్రేయ, సీఐలు వంశీధర్, శ్రీనివాసరావు ఉన్నారు.

వాట్సాప్‌లోనే ‘మీ సేవ’లు!

image

TG: రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పదేపదే మీ-సేవ సెంటర్లకు వెళ్లకుండా ఆ సేవలన్నీ వాట్సాప్‌ ద్వారానే అందించనుంది. మీ-సేవ సెంటర్లో దరఖాస్తు చేసుకున్న అనంతరం అందుకు సంబంధించిన అన్ని అప్డేట్స్ వాట్సాప్‌లోనే చెక్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన సర్టిఫికెట్ ఆమోదం పొందిందా? లేదా? అప్రూవ్ అయితే సర్టిఫికెట్‌ను వాట్సాప్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రేపు ఈ సేవలను లాంచ్ చేయనున్నారు.