News September 13, 2024

జ్యోతిషుడు వేణుస్వామికి షాక్

image

ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి, జర్నలిస్ట్ మూర్తి వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వేణుస్వామిపై కేసు నమోదు చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది. ప్రజలను జాతకాల పేరుతో ఆయన మోసం చేస్తున్నారని, ప్రధాని ఫొటోనూ మార్ఫింగ్ చేశారని మూర్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జ్యోతిషుడిపై కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది.

Similar News

News November 27, 2025

ఖమ్మం: 50 వేల మంది మహిళలకు ‘ఉల్లాస్‌’ వెలుగులు

image

15 ఏళ్లు నిండిన నిరక్షరాస్యులైన మహిళలకు సంపూర్ణ అక్షరాస్యత కల్పించేందుకు కేంద్రం ‘ఉల్లాస్‌’ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద జిల్లాలోని డ్వాక్రా మహిళల్లో 50 వేల మందికి పైగా అక్షరాస్యులు కానీ వారిని గుర్తించారు. వీరికి చదవడం, రాయడంతో పాటు జీవన నైపుణ్యాలు నేర్పడానికి ప్రతి 10 మందికి ఒక వలంటీర్‌ను నియమించి, అంగన్వాడీ కేంద్రాలు, పంచాయతీల్లో శిక్షణ ఇస్తున్నారు.

News November 27, 2025

పారిపోయిన వారిని తీసుకొచ్చే హక్కు కేంద్రానికి ఉంది: సుప్రీంకోర్టు

image

నేరాలు చేసి విదేశాలకు పారిపోయిన వారిని తీసుకొచ్చే హక్కు కేంద్రానికి ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. గుజరాత్‌కు చెందిన విజయ్ మురళీధర్ ఉద్వానీ కేసు విచారణలో జడ్జీలు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 2022 జులైలో దుబాయ్ పారిపోయిన ఉద్వానీపై గుజరాత్ హైకోర్టు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. దానిని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది.

News November 27, 2025

ఆ మృగం మూల్యం చెల్లించుకోక తప్పదు: ట్రంప్

image

వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌ వద్ద <<18399882>>కాల్పుల ఘటనపై<<>> US అధ్యక్షుడు ట్రంప్ ఘాటుగా స్పందించారు. నిందితుడిని మృగంగా సంబోధిస్తూ.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ‘ఇద్దరు నేషనల్ గార్డ్‌మెన్‌లను ఆ యానియల్ తీవ్రంగా గాయపర్చింది. వారికి చికిత్స అందిస్తున్నాం. నిందితుడిని వదలబోం’ అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాల్పుల నేపథ్యంలో వైట్‌హౌస్‌ను లాక్‌డౌన్ చేసిన విషయం తెలిసిందే.