News November 16, 2024
రామ్మూర్తి మరణం కలచివేసింది: పవన్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి మరణ వార్త నన్ను కలచివేసింది. సోదర వియోగంతో బాధపడుతున్న చంద్రబాబు నాయుడుకి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో ఉన్నందున రామ్మూర్తి అంత్యక్రియలకు హాజరుకాలేకపోతున్నా. నారా రోహిత్, ఆయన కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు.
Similar News
News November 24, 2025
పంటల్లో బోరాన్ లోపాన్ని ఎలా సవరించాలి?

ఇసుక, సున్నం, చౌడు నేలల్లో బోరాన్ లోపం ఎక్కువగా కనిపిస్తోంది. భూసార పరీక్షలతో బోరాన్ లోపం గుర్తించే నేలల్లో 4 కిలోల బోరోక్స్ను ఎకరానికి దుక్కిలో వేసి కలియదున్నాలి. సేంద్రీయ ఎరువులను వాడాలి. పంటల్లో బోరాన్ లోపం గమనిస్తే 1 గ్రా. బోరాక్స్ను లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. వాణిజ్య పంటల్లో 1% బోరాక్స్ ద్రావణాన్ని మొలకెత్తిన 30, 45, 60, 90 రోజుల్లో పిచికారీ చేయాలి.
News November 24, 2025
పిల్లలకి ఘనాహారం ఎలా అలవాటు చెయ్యాలంటే?

చిన్నారులకు 6నెలలు దాటిన తర్వాత కాంప్లిమెంటరీ ఫీడింగ్ రాగి మాల్ట్, ఉగ్గు వంటివి స్టార్ట్ చెయ్యాలి. నెమ్మదిగా బ్రకోలీ, చిక్కుళ్లు, బీన్స్, బీరకాయ, క్యారెట్, బీట్రూట్ ఆవిరిపై ఉడికించి వారికి తినిపించాలి. అప్పుడే వారి శరీరం భిన్నరకాల ఆహారాలకు అలవాటవుతుంది. పోషకాలూ అందుతాయి. చాలామంది పేరెంట్స్ ఇడ్లీ, రసం, పెరుగన్నం త్వరగా తింటున్నారని అవే పెడతారు. దీంతో ఎదుగుదలలో ఇబ్బందులు వస్తాయంటున్నారు నిపుణులు.
News November 24, 2025
కీలక తీర్పుల్లో సూర్యకాంత్ ముద్ర

53వ CJIగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్ అనేక కీలక తీర్పుల్లో భాగస్వామ్యం అయ్యారు. జమ్మూకశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు, భావ ప్రకటనా స్వేచ్ఛ, అవినీతి, పర్యావరణం, లింగ సమానత్వం వంటి ప్రధాన అంశాలపై ఆయన సభ్యుడిగా ఉన్న ధర్మాసనాలు ఇచ్చిన తీర్పులు విశేషంగా నిలిచాయి. దేశద్రోహ చట్టాన్ని నిలిపివేసిన ధర్మాసనంలో కూడా సభ్యుడు. ఈ చట్టం కింద కొత్త FIRలు నమోదు చేయొద్దని ఆదేశించారు.


