News February 13, 2025

కుంభమేళాలో చాయ్‌వాలా ఆదాయం తెలిస్తే షాక్!

image

కోట్లమంది రాకతో మహా కుంభమేళా వద్ద తిండి పదార్థాలు, టీలు, కాఫీలు, వాటర్ బాటిళ్లకు విపరీతమైన గిరాకీ ఉంటోంది. అక్కడ టీ, కాఫీ అమ్ముతూ ఓ చాయ్‌వాలా ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవుతారు. అతడి సంపాదన నిత్యం రూ.7000. అందులో రూ.2000 ఖర్చులు పోను రూ.5000 మిగులుతున్నట్లు అతడు చెప్పుకొచ్చాడు. అంటే కుంభమేళా జరిగే నెలరోజుల్లో అతడి ఆదాయం రూ.1.50లక్షలకు పైనేనంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News February 13, 2025

రైతులకు 9 గంటల విద్యుత్ అందాల్సిందే: మంత్రి గొట్టిపాటి

image

AP: వేసవిలో విద్యుత్ కోతలు ఉండరాదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రైతులకు 9 గంటల ఉచిత కరెంట్ అందాల్సిందేనని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా స్మార్ట్ మీటర్ల పరికరాల బిల్లులను చెల్లించారనే ఆరోపణలపై ఎస్పీడీసీఎల్ ఎండీ సంతోష్‌రావును వివరణ కోరారు. ఈ విషయంలో సీఎం అసంతృప్తిని ఎండీకి వివరించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా పనిచేయాలని సూచించారు.

News February 13, 2025

రూ.500 ఇచ్చి ఫొటో పంపిస్తే.. కుంభమేళాలో స్నానం!

image

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోన్న ‘మహాకుంభమేళా’ను ఇప్పటికే 45 కోట్ల మంది భక్తులు సందర్శించారు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో చాలా మంది పాల్గొనలేకపోతున్నారు. అలాంటి వారిని ‘ముంచేందుకు’ కొందరు పథకం పన్నుతున్నారు. రూ.500 చెల్లించి ఫొటోలు వాట్సాప్ చేస్తే వాటిని త్రివేణి సంగమంలో ముంచుతామని, ఇలా చేస్తే మీరు స్నానం చేసినట్లేనని ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

News February 13, 2025

చేపలకు మేతగా బర్డ్ ఫ్లూ కోళ్లు!

image

AP: తూర్పు గోదావరిలో మరో ఘటన ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లను జగ్గంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు, పెద్దాపురంలోని చెరువుల్లో చేపలకు ఆహారంగా ఇస్తున్నారు. దీంతో చేపలు తినాలా? వద్దా? అని జనాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

error: Content is protected !!