News December 27, 2024
షాకింగ్: మీ సేవ పేరుతో నకిలీ వెబ్‌సైట్

TG: సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ విజృంభిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వ సైట్ meeseva.telangana.gov.in కాగా meesevatelangana.in పేరుతో నకిలీది సృష్టించారు. కొత్తగా మీ సేవ కేంద్రాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామంటూ HYD కలెక్టర్ పేరుతో ఫేక్ ఉత్తర్వులు రూపొందించారు. అది చూసి చాలా మంది ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేశారు. ఈ స్కామ్‌పై సైబర్ సెల్ దర్యాప్తు చేస్తోంది. నకిలీ సైట్‌ను బ్లాక్ చేసింది.
Similar News
News February 3, 2026
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(<
News February 3, 2026
కోళ్లలో రక్తపారుడు.. తీవ్రమైతే మరణం తప్పదు

కోళ్లలో వైరస్, సూక్ష్మజీవుల వల్ల రక్తపారుడు వ్యాధి వస్తుంది. ఇది కూడా చిన్న కోడి పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోగం వస్తే కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వ్యాధి బారినపడ్డ కోడి పిల్లలు ఒకేచోట గుమిగూడి రక్త విరేచనాలతో బాధపడతాయి. లక్షణాలు మరీ తీవ్రంగా మారితే కోడి పిల్లలు మరణించే అవకాశం ఉంది. వ్యాధి నివారణకు లిట్టరును పొడిగా ఉంచాలి. వెటర్నరీ నిపుణులకు తెలిపి వారి సలహాలను పాటించాలి.
News February 3, 2026
పౌర్ణమి చంద్రుడు కలలో వస్తే..?

ఇది శుభప్రదమైన సంకేతం. అలాగే చేపట్టిన పనుల్లో త్వరలోనే విజయం వరిస్తుందని సూచిస్తుంది. కుటుంబంలో ఉన్న మనస్పర్థలు తొలగి, సంబంధాలు మరింత బలపడతాయని అర్థం. జ్యోతిషశాస్త్ర రీత్యా చంద్రుడు మాతృకారకుడు. అంటే ఈ కల తల్లి ఆరోగ్యం మెరుగుపడటాన్ని, ఆమెతో అనుబంధం పెరగడాన్ని సూచిస్తుంది. విదేశీ ప్రయాణ అవకాశాలను, వైవాహిక జీవితంలో మధురమైన సుఖశాంతులను సూచిస్తుంది. ఇది రాబోయే గొప్ప సానుకూల మార్పులకు ప్రతీక.


