News June 24, 2024
Shocking: 14 ఏళ్లలో భూమితో గ్రహశకలం ఢీ?

మరో 14 ఏళ్లలో భూమిని ఓ ఆస్టరాయిడ్ ఢీకొట్టే ప్రమాదం ఉందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తమ తాజా నివేదికలో వెల్లడించింది. 2038 జులై 12న గ్రహశకలం భూమిని ఢీకొట్టేందుకు 72శాతం అవకాశాలున్నాయని స్పష్టం చేసింది. మేరీల్యాండ్‌లోని జాన్స్ హాప్కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ లాబొరేటరీ చేసిన పరిశోధనల్లో ఈమేరకు తేలిందని పేర్కొంది. మరిన్ని అధ్యయనాల అనంతరం దాని దిశ ఎలా మార్చాలన్న దానిపై కృషి చేస్తామని వివరించింది.
Similar News
News September 18, 2025
మళ్లీ భారత్vsపాకిస్థాన్ మ్యాచ్.. ఎప్పుడంటే?

ఆసియా కప్-2025లో భారత్vsపాకిస్థాన్ మరోసారి తలపడనున్నాయి. సూపర్-4లో ఈ ఆదివారం (Sep 21) రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇప్పటికే గ్రూప్ స్టేజీలో భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోరంగా ఓడింది. కాగా గ్రూప్-A నుంచి భారత్, పాక్ సూపర్-4కు క్వాలిఫై అయ్యాయి. సూపర్-4లో ఒక్కో జట్టు 3 మ్యాచులు ఆడనుంది. అటు గ్రూప్-Bలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ సూపర్-4 రేసులో ఉన్నాయి.
News September 18, 2025
భారత్ డ్రగ్స్ ఉత్పత్తి కేంద్రం.. ట్రంప్ తీవ్ర ఆరోపణ

భారత్, చైనా, పాక్ సహా 23 దేశాలు డ్రగ్స్ ఉత్పత్తి కేంద్రాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. ఈ దేశాలు డ్రగ్స్, వాటి తయారీకి కావాల్సిన రసాయనాలను ఉత్పత్తి, రవాణా చేస్తూ US ప్రజల భద్రతకు ప్రమాదంగా మారాయని విమర్శించారు. అఫ్గాన్, మెక్సికో, హైతీ, కొలంబియా, పెరూ, పనామా, బొలీవియా, బర్మా వంటి దేశాలు ఈ లిస్ట్‌లో ఉన్నాయి. US కాంగ్రెస్‌కు సమర్పించిన ప్రెసిడెన్షియల్ డిటర్మినేషన్‌లో ఈ ఆరోపణలు చేశారు.
News September 18, 2025
నేడు రాహుల్ గాంధీ ‘స్పెషల్’ ప్రెస్ మీట్

ఇవాళ రాహుల్ గాంధీ ఓ స్పెషల్ ప్రెస్ మీట్ నిర్వహిస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఢిల్లీలోని ఇందిరా భవన్ ఆడిటోరియంలో ఉ.10 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడతారని తెలిపింది. అయితే ఏ అంశాలపై ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారనే విషయాన్ని వెల్లడించలేదు. కొత్తగా రెండు రాష్ట్రాల్లోని రెండు నియోజకవర్గాలు, హై ప్రొఫైల్ లోక్‌సభ స్థానంపై ఓట్ చోరీ ఆరోపణలు చేస్తారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.