News September 15, 2024
SHOCKING: అఫ్గానిస్థాన్లో క్రికెట్ నిషేధం?

అఫ్గానిస్థాన్లో క్రికెట్ను క్రమంగా నిషేధించాలని ఆ దేశ సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. షరియా చట్టానికి క్రికెట్ హాని కలిగిస్తోందని తాలిబన్ సుప్రీం లీడర్ హిబతుల్లా భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. షరియాను మరింత కఠినంగా అమలు చేయాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. బలమైన జట్టుగా ఎదుగుతున్న అఫ్గాన్కు ఇది శరాఘాతమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Similar News
News November 27, 2025
స్కిల్స్ లేని డిగ్రీలెందుకు: స్టూడెంట్స్

మారుతున్న ఉద్యోగ మార్కెట్కు అనుగుణంగా అకడమిక్ సిలబస్లో మార్పులు తీసుకురావాలని కొందరు విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాలేజీ దశలోనే నైపుణ్య ఆధారిత కోర్సులు, ఉద్యోగ కోచింగ్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. నైపుణ్యం లేని డిగ్రీలతో బయటకు వస్తే ఉద్యోగాలు దొరకడం లేదని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అందుకే ఉద్యోగం ఇప్పిస్తామని <<18402171>>మోసం<<>> చేసేవారు పెరుగుతున్నారన్నారు. మీ కామెంట్?
News November 27, 2025
7,948 MTS, హవల్దార్ పోస్టులు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<
News November 27, 2025
రాజధాని రైతులతో చంద్రబాబు సమావేశం

AP: అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు సమావేశం అయ్యారు. ఇందులో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, జిల్లా కలెక్టర్ అన్సారియా పాల్గొన్నారు. గ్రామ కంఠాలు, జరీబు, అసైన్డ్, లంక భూములు, వీధిపోటు సమస్యలు, రాజధాని గ్రామాల్లో వసతులు, ఉద్యోగాల కల్పనపై చర్చించారు.


