News October 25, 2024

SHOCKING: షుగర్, బీపీలా 8 కోట్ల మందికి గ్యాంబ్లింగ్ డిజార్డర్

image

డిజిటల్ విప్లవం అనేక మార్పులతో పాటు కొన్ని రోగాల్నీ తెచ్చిపెట్టింది. అందుకిదే ఉదాహరణ. ప్రపంచ వ్యాప్తంగా 8కోట్ల మంది గ్యాంబ్లింగ్ డిజార్డర్ లేదా జూదరోగంతో బాధపడుతున్నారని లాన్సెట్ తెలిపింది. ఆన్‌లైన్ క్యాసినో, గేమ్స్, బెట్టింగ్ మార్కెట్లే ఇందుకు కారణమంది. ఈజీ మనీ పేరుతో పిల్లలు, పెద్దలు వీటికి ఆకర్షితులవుతున్నారని పేర్కొంది. మొత్తంగా 44 కోట్ల మందికి గ్యాంబ్లింగ్ రిస్క్ ఉన్నట్టు వెల్లడించింది.

Similar News

News October 25, 2025

దాని బదులు చావును ఎంచుకుంటా: లాలూ కుమారుడు

image

RJD చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరిగి తండ్రి పార్టీలో చేరే బదులు చావును ఎంచుకుంటానని చెప్పారు. తనకు నైతిక విలువలు, ఆత్మగౌరవమే ముఖ్యమని తెలిపారు. పార్టీ లైన్ క్రాస్ చేయడంతో కొన్ని నెలల క్రితం ఆయనను ఆర్జేడీ బహిష్కరించింది. ఈ క్రమంలో జనశక్తి జనతాదళ్ పార్టీ స్థాపించిన ఆయన గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన మహువా అసెంబ్లీ స్థానం నుంచే బరిలోకి దిగుతున్నారు.

News October 25, 2025

ఆ యాప్‌లను అధిగమించలేము: పర్‌ప్లెక్సిటీ సీఈవో

image

యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్‌ను అధిగమించడం అసాధ్యమని ఏఐ సెర్చింజన్ పర్‌ప్లెక్సిటీ CEO అరవింద్ శ్రీనివాస్ అన్నారు. గూగుల్ రూపొందించిన ఇతర యాప్‌‌లను మాత్రం స్టార్టప్ సంస్థలు అధిగమించవచ్చని అభిప్రాయపడ్డారు. గూగుల్ ఎకో సిస్టమ్‌ను ఏ స్టార్టప్ దాటలేదని ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు ఆయన‌పై విధంగా బదులిచ్చారు. గూగుల్ సృష్టించిన జెమినీని అధిగమించడం కష్టమేనని పలువురు పేర్కొన్నారు. అరవింద్ కామెంట్స్‌పై మీరేమంటారు?

News October 25, 2025

అక్టోబర్ 25: చరిత్రలో ఈరోజు

image

1921: సంగీత దర్శకుడు టి.వి.రాజు జననం
1962: గేయ రచయిత కలేకూరి ప్రసాద్ జననం
1968: సినీ నటుడు సంపత్ రాజ్ జననం
1999: సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు మరణం(ఫొటోలో)
1951: దేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం
* అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం