News February 10, 2025
SHOCKING: వాట్సాప్‌లో పెళ్లి.. పోలీస్ స్టేషన్లో యువకుడి రచ్చ

బిహార్ ముజఫర్‌పూర్‌లో అసాధారణ ఘటన జరిగింది. ఇంటర్ బాలికను వాట్సాప్‌లో పెళ్లాడినట్లు బాలుడు పేర్కొన్నాడు. నిఖా కబూల్ హై(పెళ్లి సమ్మతమేనా?) అనే మెసేజ్‌కు ఇద్దరూ 3సార్లు అంగీకారం తెలిపినట్లు చెబుతున్నాడు. ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో పోలీస్ స్టేషన్లో రచ్చ చేశాడు. కౌన్సెలింగ్ ఇచ్చినా మార్పురాలేదు. పేరెంట్స్ నుంచి అధికారిక ఫిర్యాదు తర్వాత లీగల్ యాక్షన్ తీసుకోవడానికి పోలీసులు ఎదురుచూస్తున్నారు.
Similar News
News December 9, 2025
7వేల రిజిస్ట్రేషన్లే పెండింగ్: మంత్రి నారాయణ

AP: రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ చెప్పారు. 66K ప్లాట్లలో 7K మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉందన్నారు. త్వరలోనే ఈ ప్రక్రియ కూడా పూర్తవుతుందని, రైతులు ముందుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. లంక భూములు, అసైన్డ్ భూముల సమస్యలను వచ్చే మంత్రివర్గ సమావేశంలో పరిష్కరిస్తామన్నారు. రాజధానిలో జరుగుతున్న పనులను ఆయన ఇవాళ పరిశీలించారు.
News December 9, 2025
పోస్టర్ రగడ.. ‘కుంభ’గా రేవంత్ రెడ్డి

TG: ‘వారణాసి’ సినిమాలోని విలన్(కుంభ) పాత్రలో CM రేవంత్ ఉన్నట్లుగా పోస్టర్ క్రియేట్ చేసిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే దీనిని తాజాగా BJP షేర్ చేయడం వివాదానికి ఆజ్యం పోసినట్లైంది. భారతదేశంలో ఎమర్జెన్సీ మైండ్‌సెట్ ఇంకా సజీవంగానే ఉందని మండిపడింది. రేవంత్ ప్రభుత్వం నియంతృత్వ వైఖరి అవలంబిస్తోందని, అవినీతి పాలన కొనసాగిస్తోందని X వేదికగా బీజేపీ విమర్శలు గుప్పించింది.
News December 9, 2025
‘ఇండిగో’ సంస్థకు షాక్ ఇచ్చిన కేంద్రం

దేశవ్యాప్తంగా వందలాది విమానాల రద్దు, ఆలస్యంపై విమానయాన సంస్థ ఇండిగోకు కేంద్రం గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఇండిగోకు ఉన్న స్లాట్లలో 5% కోత విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రోజూ నడిచే సర్వీసులు కనీసం 110 వరకు తగ్గే అవకాశముంది. తగ్గించిన స్లాట్లు ఎయిర్ ఇండియా, ఆకాశ, స్పైస్‌జెట్ వంటి సంస్థలకు కేటాయించనున్నారు. ప్రయాణికుల అసౌకర్యం తగ్గించేందుకు ఈ చర్యలు కీలకమని DGCA పేర్కొంది.


