News July 24, 2024

వాహనదారులకు అదిరిపోయే వార్త.. ప్రయాణించిన దూరానికే టోల్

image

టోల్ కలెక్షన్ల కోసం కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(GNSS) ఆధారంగా టోల్ వసూలు చేస్తోంది. NH-275లోని బెంగళూరు-మైసూర్, NH-709(హరియాణా)లోని పానిపట్-హిసార్ సెక్షన్లలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. వీటి ఫలితాలను బట్టి మిగతా హైవేలకు విస్తరించనుంది. ప్రయాణించిన దూరం వరకే టోల్ చెల్లించేలా ఈ విధానాన్ని పరిశీలిస్తోంది.

Similar News

News January 3, 2026

పిచ్చండి.. పిచ్చి.. కర్రలు కాలే వీడియోకు 15.6 కోట్ల వ్యూస్

image

కొన్ని యూట్యూబ్‌ వీడియోలకు మ్యాటర్ లేకున్నా బోలెడు వ్యూస్ వస్తాయి. అలాంటిదే ఈ వీడియో. ఓ వ్యక్తి కర్రలు కాలుతున్న HD వీడియోను 9 ఏళ్ల క్రితం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. 10 గంటల నిడివి ఉన్న ఆ వీడియోకు ఇప్పటివరకు ఏకంగా 156 మిలియన్ల (15.6 కోట్లు) వ్యూస్ రావడం విశేషం. క్వాలిటీ వీడియో, కర్రలు మండే సహజ శబ్దం వల్ల చాలా మంది ప్రశాంతంగా నిద్రపోయేందుకు చూసి ఉంటారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

News January 3, 2026

భారీ ఎన్‌కౌంటర్.. 14 మంది మావోలు మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. వేర్వేరు ఘటనల్లో మొత్తం 14 మంది మావోయిస్టులు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. కొంటా-కిస్తారామ్ అడవుల్లో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో 12 మంది, బీజాపూర్ జిల్లాలో ఇద్దరు మావోలను పోలీసు బలగాలు హతమార్చాయి. వీరిలో కీలక నేత సచిన్ మంగడు కూడా ఉన్నారు. దీంతో కొంటా ఏరియా కమిటీ పూర్తిగా హతమైనట్లు పోలీసులు వెల్లడించారు. అడవుల్లో గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

News January 3, 2026

ఇందిరమ్మ ఇళ్లకూ ఫ్రీ కరెంట్: భట్టి విక్రమార్క

image

TG: కొత్తగా ఇందిరమ్మ ఇల్లు మంజూరైన వారికి కూడా ఉచిత కరెంట్ అందిస్తామని Dy.CM భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పటికీ పథకం అందని అర్హులెవరైనా ఉంటే MPDO, మున్సిపల్ ఆఫీసులలో ఉండే ప్రజాపాలన అధికారులను సంప్రదించొచ్చని వెల్లడించారు. విద్యుత్తు వినియోగం 200 యూనిట్లు దాటితే మాత్రం పథకం వర్తించదని తేల్చి చెప్పారు. ఫ్రీ కరెంట్ ద్వారా రాష్ట్రంలో 50%పైగా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని చెప్పారు.