News October 17, 2024

రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్

image

రైల్వే టికెట్ బుకింగ్ నియమాలను మార్చుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రయాణ రోజు నుంచి 120 రోజుల ముందే ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే సదుపాయం ఉంది. కానీ, నవంబర్ 1 నుంచి దీనిని కుదిస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. ఇకపై IRCTCలో 60 రోజుల ముందు మాత్రమే ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండనుంది. ఇప్పటికే బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఎలాంటి సమస్య ఉండదు.

Similar News

News January 5, 2026

నల్లమల సాగర్‌పై అభ్యంతరాలెందుకు: రోహత్గి

image

పోలవరం, నల్లమల సాగర్‌పై SCలో విచారణ <<18768178>>వాయిదా<<>> పడిన విషయం తెలిసిందే. AP తరఫున ముకుల్ రోహత్గి, జగదీప్ గుప్తా వాదనలు వినిపించారు. ‘రాష్ట్ర భూభాగంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నీటిని తరలించడంపై అభ్యంతరాలు ఎందుకు? నా స్థలంలో నేను ఇల్లు కట్టుకోవడానికి పక్కింటి వాళ్ల పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటో అర్థం కావట్లేదు’ అని TGని ఉద్దేశించి ముకుల్ రోహత్గి వ్యాఖ్యానించారు.

News January 5, 2026

నాభిలో ‘సూక్ష్మ’ ప్రపంచం.. ఇంత కథ ఉందా?

image

మన శరీరం అద్భుత నిలయం. అందులోనూ మన నాభి మరింత ప్రత్యేకం. ఇందులో వేలాది సూక్ష్మజీవులు నివసిస్తాయనే విషయం మీకు తెలుసా? మన నాభిలో ఏకంగా 2,368 రకాల సూక్ష్మజీవులు ఉంటాయని US నేషనల్ జియోగ్రాఫిక్ పరిశోధనలో తేలింది. స్నానం చేసినా వాటిని తొలగించలేం. విచిత్రమేంటంటే ఇందులో 1,458 జాతులు శాస్త్రవేత్తలకు కూడా కొత్తే. వేలిముద్రల్లాగే ఒకరి బొడ్డులోని బ్యాక్టీరియా మరొకరి దాంట్లో ఉండదని వారు చెబుతున్నారు.

News January 5, 2026

ఆ తెలంగాణ ప్రాజెక్టులు నేనే నిర్మించా: CBN

image

AP:TGలో కృష్ణా నదిపై కల్వకుర్తి, AMR లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టెంపాడు ప్రాజెక్టులను తానే నిర్మించానని CM CBN తెలిపారు. ‘APలో కృష్ణా డెల్టా మోడ్రనైజేషన్‌తో పొదుపుచేసిన 20 TMCల నీటిని TGకి ఇచ్చి భీమా లిఫ్ట్‌ను పూర్తి చేయించా. గోదావరిపై TGలో గుప్త, అలీసాగర్, దేవాదుల ఎత్తిపోతలు తెచ్చా. APలో చాగల్నాడు, పుష్కర, తాటిపూడి చేపట్టాం. 2014లో పట్టిసీమ చేపట్టాం’ అని గుంటూరులో తెలుగు మహాసభల్లో వివరించారు.