News August 17, 2024
కలిచివేసే PHOTO

TG: ఉదయాన్నే తల్లిదండ్రులకు టాటా చెప్పి ఆనందంగా స్కూల్కు బయలుదేరిన ఓ విద్యార్థిని కాసేపటికే మృత్యు ఒడికి చేరుకుంది. రోడ్డు ప్రమాదంలో ఆ చిన్నారి చెయ్యి నిర్జీవంగా వేలాడుతున్న ఫొటో అందరినీ కలచివేస్తోంది. హైదరాబాద్ హబ్సిగూడలో వెనక నుంచి కంటైనర్ ఢీకొట్టడంతో ఓ ఆటో ముందు వెళ్తున్న బస్సు కిందకి చొచ్చుకెళ్లింది. దీంతో ఆటోలో ఉన్న టెన్త్ విద్యార్థిని సాత్విక అక్కడికక్కడే దుర్మరణం పాలైంది.
Similar News
News January 17, 2026
వేప మందుల వాడకంలో మెళకువలు

వేప నూనె వాడేటప్పుడు సబ్బు ద్రావణం తప్పనిసరిగా వాడాలి. వేపనూనె, ద్రావణాలను సాయంత్రం చల్లితే ఫలితం బాగుంటుంది. ద్రావణాన్ని తయారు చేసిన తర్వాత వెంటనే పిచికారీ చేయాలి. ఆలస్యం చేయకూడదు. పంటకు కీడుచేసే పురుగుల గుడ్డు పొదిగే దశలో వేప మందును చల్లితే లార్వాల సంఖ్య గణనీయంగా తగ్గించవచ్చు. బాగా ఎదిగిన లార్వాలు పంటను ఆశిస్తే వేప మందులను నిపుణుల సూచనలతో రసాయన మందులతో కలిపి వాడితే ఫలితాలు బాగుంటాయి.
News January 17, 2026
ఎగ్జిమ్ బ్యాంక్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News January 17, 2026
BREAKING: మేయర్ల రిజర్వేషన్లు ఖరారు

TG: కార్పొరేషన్ మేయర్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మహిళలకు 50% రిజర్వేషన్లు కేటాయించినట్లు మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి వెల్లడించారు.
*నిజామాబాద్- మహిళ జనరల్ *నల్గొండ- మహిళ జనరల్
*ఖమ్మం- మహిళ జనరల్ *గ్రేటర్ వరంగల్- జనరల్
*GHMC- మహిళ జనరల్ *కరీంనగర్- బీసీ జనరల్
*మంచిర్యాల- బీసీ జనరల్ *మహబూబ్నగర్- బీసీ మహిళ
*రామగుండం- ఎస్సీ జనరల్ *కొత్తగూడెం- ఎస్టీ జనరల్


