News December 9, 2024
SHOCKING: యూట్యూబ్లో పుష్ప-2 స్ట్రీమింగ్

పుష్ప-2 నిర్మాతలకు మరో షాక్ తగిలింది. మూవీ విడుదలైన రోజే పలు ఆన్లైన్ సైట్లలో లీకవగా తాజాగా కొందరు యూట్యూబ్లో హిందీ వెర్షన్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ ఘటనలపై మేకర్స్ ఇంకా స్పందించలేదు. త్వరలోనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని సమాచారం.
Similar News
News November 25, 2025
ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి సూచన

సోయాబీన్, మొక్కజొన్న, జొన్న, పత్తి పంట అవశేషాల దహనం వల్ల గాలి కాలుష్యం, భూసార, జీవవైవిధ్య నష్టం, భూమిలోని ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు నశించడం వంటి సమస్యలు ఏర్పడతాయని DAO శ్రీధర్ తెలిపారు. రైతులు వ్యవసాయ వ్యర్థాలను లేదా పంట అవశేషాలను కాల్చకుండా వాటిని కంపోస్ట్, వర్మీ కంపోస్ట్గా మార్చి లేదా భూమిలో కలియదున్నాలని, వ్యవసాయంలో సేంద్రియ ఎరువులుగా వినియోగించుకోవాలన్నారు. భూసారాన్ని సంరక్షించాలని అన్నారు
News November 25, 2025
సాయంత్రం టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్

మెన్స్ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇవాళ విడుదల కానుంది. సాయంత్రం 6.30 గంటలకు మ్యాచులు, వేదికల వివరాలను రోహిత్, సూర్య, మాథ్యూస్, హర్మన్తో ICC రివీల్ చేయించనుంది. IND, శ్రీలంక సంయుక్తంగా హోస్ట్ చేయనున్న ఈ టోర్నీలో 20జట్లు పాల్గొంటాయి. PAK మ్యాచులన్నీ లంకలో జరుగుతాయి. IND డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనుంది. గతేడాది జరిగిన ఫైనల్లో RSAపై 7 రన్స్ తేడాతో గెలిచి జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే.
News November 25, 2025
పాలిష్ బియ్యం తింటే కలిగే నష్టాలేంటో తెలుసా?

తెల్లగా కనిపించే పాలిష్ రైస్ తినడం మంచిది కాదని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరానికి తగినంత B1 అందక బెరిబెరి వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నందున రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి టైప్2 డయాబెటిస్ రావచ్చు. ఫైబర్ తక్కువగా ఉండడంతో అజీర్ణం, కడుపు ఉబ్బరం, శ్వాస సంబంధ సమస్యలు వచ్చే చాన్స్ ఉంది. శరీరానికి అవసరమైన పోషకాలు అందక కీళ్ల నొప్పులు వస్తాయి.


