News March 7, 2025
SHOCKING: వన్డే కెప్టెన్సీకి రోహిత్ గుడ్ బై?

ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం ODI కెప్టెన్సీకి రోహిత్ గుడ్ బై చెప్పే అవకాశం కనిపిస్తోంది. NDTV కథనం ప్రకారం.. చీఫ్ సెలక్టర్ అగార్కర్, కోచ్ గంభీర్‌తో జరిగిన సమావేశంలో రోహిత్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తర్వాతి ODI ప్రపంచకప్ సమయానికి టీమ్ ఇండియా కొత్త సారథిని తయారుచేసేందుకు ఇదే సమయమని ఆయన భావించినట్లు తెలుస్తోంది. ఫిట్‌నెస్ బాగున్నంత కాలం ప్లేయర్‌గా కొనసాగేందుకు ఆయన సుముఖత చూపించినట్లు సమాచారం.
Similar News
News November 12, 2025
600 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News November 12, 2025
భారీ ‘ఉగ్ర కుట్ర’.. సంచలన విషయాలు

ఢిల్లీలోని ఎర్రకోట మెట్రోస్టేషన్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడి ఘటనపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జనవరి 26 గణతంత్ర దినోత్సవం, దీపావళి రోజున భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర చేసినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఇందుకోసం ఉమర్ నబీ, ఉమర్ మహ్మద్ పలుమార్లు ఎర్రకోట వద్ద రెక్కీ చేసినట్లు సమాచారం. కాగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు 9 మందిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.
News November 12, 2025
కర్రపెండలంలో మెగ్నీషియం లోప లక్షణాలు

కర్రపెండలం మొక్కలో మెగ్నీషియం లోపం వల్ల ఆకు ఈనెల మధ్య భాగం పసుపు రంగులోకి మారుతుంది. తీవ్రత ఎక్కువగా ఉంటే పసుపు రంగులోకి మారిన ఆకు భాగాల కణాలు మృతి చెంది గోధుమ రంగులోకి లేదా తెలుపు రంగులోకి మారిపోతాయి. నేలలో పొటాషియం ఎక్కువగా ఉన్నా కూడా మొక్కలలో మెగ్నిషియం లోపం కనిపిస్తుంది. నివారణకు ఎకరాకు 8 కేజీల మెగ్నీషియం సల్ఫేట్ భూమిలో వేసి కప్పాలి. 1% మెగ్నీషియం సల్ఫేట్ మొక్కలపై పిచికారీ చేయాలి.


