News September 24, 2024
SHOCKING: తిరుమల లడ్డూలో పొగాకు

తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ వ్యవహారం మరువకముందే తాజాగా లడ్డూలో పొగాకు రావడం భక్తులను కలవరపెడుతోంది. ఖమ్మం(D) గొల్లగూడెంలోని కార్తికేయ టౌన్షిప్లో ఓ కుటుంబం ఇటీవల తిరుపతికి వెళ్లొచ్చింది. పంచేందుకు లడ్డూ బయటకు తీయగా అందులో పొగాకు పొట్లం రావడంతో షాకయ్యారు. ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం తయారీలో నాణ్యత పాటించడం లేదని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని ఉపేక్షించవద్దని వారు కోరుతున్నారు.
Similar News
News November 28, 2025
‘పిచ్చుకల పరిరక్షణలో విద్యార్థులను భాగస్వాములు చేయాలి’

కాకినాడ జిల్లాలోని ప్రతి విద్యార్థికి స్వయంగా ధాన్యం కుంచె తయారీ నేర్పించి, పిచ్చుకల పరిరక్షణ ఉద్యమంలో భాగస్వాములను చేయాలని తునికి చెందిన విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు పి. దాలినాయుడు కోరారు. గురువారం ఆయన కాకినాడ కలెక్టరేట్లో కలెక్టర్ షాన్మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. పిచ్చుకల పరిరక్షణకు తాను చేపట్టిన కార్యక్రమం వివరాలను ఆయన కలెక్టర్కు వివరించారు.
News November 28, 2025
టుడే టాప్ స్టోరీస్

*రాజధాని రైతులకు న్యాయం చేయడం నా బాధ్యత: CM CBN
*దిత్వా తుఫానుతో రానున్న మూడ్రోజులు కోస్తా, సీమలో భారీ వర్షాలు
*TGలో తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
*TG: 2015 గ్రూప్-2 ర్యాంకర్ల నియామకాలు రద్దు చేయాలన్న సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసిన HC డివిజన్ బెంచ్
*ఆధార్తో ఓటు హక్కు, పౌరసత్వం కుదరదు: సుప్రీంకోర్టు
*వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు మహిళల ప్రీమియర్ లీగ్