News December 20, 2024

SHOCKING: రోహిత్, కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తారా..?

image

స్పిన్నర్ అశ్విన్ బాటలోనే రోహిత్, కోహ్లీ, జడేజా కూడా రిటైర్మెంట్ బాట పట్టనున్నారా? టీమ్ ఇండియాలో సీనియర్ స్టార్లు వచ్చే ఏడాది జరిగే ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌లోపు అంతర్జాతీయ కెరీర్‌కు తెరదించే అవకాశం ఉందని ‘క్రిక్‌బజ్’ ఓ కథనంలో తెలిపింది. ‘అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం.. సీనియర్లు తమ కెరీర్లను ముగించే ఛాన్స్ ఉంది. వచ్చే ఏడాది నుంచి భారత జట్టు పూర్తి కొత్తగా కనిపించనుంది’ అని స్పష్టం చేసింది.

Similar News

News February 4, 2026

హెయిర్ డై చేస్తున్నారా?

image

మొదటిసారి హెయిర్ డై వాడేవారు ముందుగా టెస్ట్ చేసుకోవాలి. చెవి వెనుక భాగంలో కాస్త డై రాసుకొని ఎలాంటి రియాక్షన్ లేకపోతే దాన్ని వాడొచ్చు. ఇంట్లోనే డై చేసుకోవాలనుకుంటే ముందుగా ఒక రెండుసార్లు పార్లర్‌లో ప్రొఫెషనల్స్‌తో వేయించుకోవాలి. వారు ఎలా వేస్తున్నారో గమనించి తర్వాత ఆ టెక్నిక్స్‌ను ఇంటి దగ్గర వాడటం మంచిది. వీలైనంత వరకు నాణ్యంగా ఉన్న డైలనే వాడాలి. లేదంటే కళ్లు, పెదాలు వాపు, దురద వంటివి వస్తాయి.

News February 4, 2026

‘కొరియానే మా లోకం’.. మైనర్ సిస్టర్స్ సూసైడ్ కేసులో షాకింగ్ నిజాలు!

image

ఘజియాబాద్‌(UP) సిస్టర్స్ <<19045678>>ఆత్మహత్య<<>> కేసులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ముగ్గురూ కొరియన్ కల్చర్‌కు అడిక్ట్ అయ్యి పేర్లనూ మార్చుకున్నారని తండ్రి చేతన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కొరియాను మా నుంచి ఎవరూ దూరం చేయలేరు’ అని తరచూ అనేవారట. సూసైడ్ లెటర్‌లో ‘అమ్మానాన్న సారీ’ అని ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గది లోపల లాక్ చేసుకొని బాల్కనీ నుంచి దూకినట్లు తేలింది.

News February 4, 2026

విమానంలో చోరీ.. లగేజీలోని గోల్డ్, డైమండ్ ఆభరణాలు మాయం

image

విమాన ప్రయాణంలో తన లగేజీలోని గోల్డ్, వజ్రాలు పోయాయంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించారు. అమెరికాలో స్థిరపడిన శాంతారమేశ్ గతేడాది నవంబర్ 15న బెంగళూరు నుంచి అబుదాబికి ప్రయాణించారు. అక్కడికి వెళ్లాక లగేజీలోని 790 గ్రా. గోల్డ్, రూ. 8లక్షల విలువైన వజ్రాభరణాలు, $200 నగదు మిస్సయినట్లు గుర్తించారు. విమానాశ్రయ అధికారులను సంప్రదించగా పరిష్కారం దొరక్కపోవడంతో తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.