News August 30, 2024
SHOCKING: మీ మద్యపానంతో భవిష్యత్ తరాలపై తీవ్ర ప్రభావం

మద్యపానంతో వ్యక్తిగత ఆరోగ్యానికి ముప్పు అనేది అందరికీ తెలుసు. అయితే ఇది భవిష్యత్ తరాలనూ ప్రభావితం చేస్తుందని టెక్సాస్ వర్సిటీ అధ్యయనం వెల్లడించింది. మద్యంతో DNAలో మార్పులు లేకపోయినా బాహ్య జన్యువుల్లో ఛేంజెస్ వస్తాయని, పేరెంట్స్ నుంచి వారసత్వంగా కొనసాగుతుందని తెలిపింది. తండ్రి వ్యసనం పిల్లలు, మనవళ్ల ఆరోగ్యం, ప్రవర్తనపై ప్రభావితం చూపుతుందని, వారిలో వేగంగా వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయని పేర్కొంది.
Similar News
News December 7, 2025
అఫీషియల్.. మాజీ ప్రధాని ప్రేమాయణం

అమెరికన్ పాప్ సింగర్ కేటీ పెర్రీ, కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడోతో తన ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. జపాన్ పర్యటనలో దిగిన సెల్ఫీని Instaలో షేర్ చేశారు. ఫ్రాన్స్‌లో అక్టోబర్ 25న పెర్రీ పుట్టినరోజు వేడుకల్లో వీరిద్దరూ తొలిసారి పబ్లిక్‌లో కనిపించారు. కాగా 53 ఏళ్ల ట్రూడోకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2023లో భార్య నుంచి విడిపోయారు. పెర్రీకి 2010లో పెళ్లి కాగా 2012 నుంచి విడిగా ఉంటున్నారు.
News December 7, 2025
కోర్ సబ్జెక్ట్ లేదని అనర్హులుగా ప్రకటించలేం: సుప్రీం

అభ్యర్థి PGలో కోర్ సబ్జెక్ట్ లేదని అతడిని అనర్హుడిగా ప్రకటించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2013లో మానిటరింగ్, ఎవాల్యుయేషన్ కన్సల్టెంట్‌గా ఓ అభ్యర్థి(M.Com) ఎంపికయ్యారు. కానీ స్టాటిస్టిక్స్‌లో PG లేదని అతడిని ప్రభుత్వం తొలగించింది. దీంతో బాధితుడు SCని ఆశ్రయించారు. జాబ్‌కు కావాల్సిన ప్రధాన సబ్జెక్టు అభ్యర్థి చదివాడని, అతడి PG వేరే స్పెషలైజేషన్‌లో ఉందని తిరస్కరించలేమని SC స్పష్టం చేసింది.
News December 7, 2025
భారీ జీతంతో రైట్స్‌లో ఉద్యోగాలు..

<


