News July 29, 2024
HDFC క్రెడిట్ కార్డు యూజర్లకు AUG 1 నుంచి షాకులు

* థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా రెంటల్ లావాదేవీలపై 1% ఫీజు
* యుటిలిటీ లావాదేవీలు ₹50వేలు దాటితే 1% ఫీజు. బీమాకు లేదు
* పెట్రోలు, డీజిల్ లావాదేవీలు ₹15వేలు దాటితే 1% ఫీజు
* థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా ఎడ్యుకేషన్ ఫీజు చెల్లిస్తే 1% ఫీజు
* పై వాటి ఒక్కో లావాదేవీ పరిమితి ₹3000
* అంతర్జాతీయ లావాదేవీలపై 3.5% ఫీజు
* లేట్ పేమెంట్ ఫీజు ₹100 నుంచి ₹300కు పెంపు
* రివార్డులు, క్యాష్‌బ్యాక్ రెడిమ్షన్ ఫీజు ₹50
Similar News
News November 19, 2025
‘అరట్టై’ నుంచి బిగ్ అప్డేట్..

దేశీ మెసేజింగ్ యాప్ ‘అరట్టై’లో బిగ్ అప్డేట్ను జోహో సంస్థ తీసుకొచ్చింది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ను ప్రవేశపెట్టింది. ఇకపై డైరెక్ట్ చాట్లకు ఎన్క్రిప్షన్ రక్షణ ఉంటుందని జోహో తెలిపింది. కొత్త వెర్షన్‌ను అప్డేట్ చేసుకోవాలని యూజర్లను కోరింది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ వల్ల మెసేజ్‌ను పంపినవారు, రిసీవ్ చేసుకున్న వారే చూస్తారని చెప్పింది. గ్రూప్ చాట్స్‌కూ త్వరలో అందుబాటులోకి తెస్తామని పేర్కొంది.
News November 19, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 19, 2025
AIని గుడ్డిగా నమ్మవద్దు: సుందర్ పిచాయ్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఇచ్చే సమాధానాలను గుడ్డిగా నమ్మవద్దని గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. AI కూడా తప్పులు చేసే అవకాశం ఉందని, ఇతర టూల్స్‌లో సమాచారాన్ని వెరిఫై చేసుకోవాలని చెప్పారు. విభిన్న మాధ్యమాలతో కూడిన సమాచార వ్యవస్థ ఉండటం ముఖ్యమని తెలిపారు. ఏఐ పెట్టుబడుల ‘బబుల్’ ఏ దశలోనైనా విస్ఫోటనం చెందవచ్చని, ఈ విషయంలో కంపెనీలు అప్రమత్తంగా ఉండాలని BBC ఇంటర్వ్యూలో సూచించారు.


