News September 25, 2024
కమలా హారిస్ క్యాంపెయిన్ ఆఫీస్‌పై కాల్పులు

అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అరిజోనా క్యాంపెయిన్ ఆఫీస్‌పై కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 16 అర్ధరాత్రి తర్వాత ఇలా జరగడం రెండోసారి అన్నారు. ఆఫీస్ ముందున్న విండోస్‌పై బుల్లెట్ హోల్స్ గుర్తించామన్నారు. BB గన్ లేదా పెల్లెట్ గన్‌తో పేల్చినట్టు వారు అనుమానిస్తున్నారు. ‘రాత్రి కావడంతో ఆఫీసులో ఎవరూ లేరు. అక్కడ పనిచేస్తున్న వారి భద్రతపై ఆందోళన కలుగుతోంది’ అని వారు పేర్కొన్నారు.
Similar News
News November 23, 2025
నెల్లూరు: కరెంట్ సమస్యలా.. ఈ నం.కు కాల్ చేయండి.!

నెల్లూరు జిల్లాలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ APPSDCL కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంస్థ MD శివశంకర్ తెలిపారు. ఈ కార్యక్రమం సోమవారం ఉదయం 10-12 గంటల వరకు ఉంటుందన్నారు. జిల్లాలోని ప్రజలు తమ విద్యుత్ సమస్యలపై 8977716661కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు.
News November 23, 2025
సర్పంచ్ ఎన్నికల ఖర్చు అంతే!

TG: సర్పంచ్ ఎన్నికల ఖర్చు విషయంలో ఎన్నికల సంఘం అధికారులు మరోసారి స్పష్టత ఇచ్చారు. 2011 సెన్సెస్ ఆధారంగా ఖర్చు ఉంటుందని వెల్లడించారు. 5వేల ఓటర్లకు పైగా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.2.50 లక్షలు, 5 వేల లోపు పంచాయతీల్లో రూ.1.50 లక్షలు, 5 వేలకు పైగా జనాభా ఉన్న గ్రామాల్లో వార్డు సభ్యులకు రూ.50 వేలు, 5 వేలకు తక్కువగా ఉన్న గ్రామాల్లో రూ.30 వేల చొప్పున ఖర్చు పెట్టాల్సి ఉంటుందని వివరించారు.
News November 23, 2025
వాన్ Vs వసీం.. ఈసారి షారుఖ్ మూవీ పోస్టర్‌తో!

యాషెస్ తొలి టెస్టులో ENG ఓటమితో ఆ జట్టు మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్‌ను భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ట్రోల్ చేశారు. మ్యాచ్ 2వ రోజు ENG ఆధిపత్యం చెలాయిస్తుందని వాన్ చెప్పారు. కానీ హెడ్ చెలరేగడంతో AUS గెలిచింది. దీంతో వసీం ‘కభీ ఖుషీ కభీ ఘమ్’ ఫొటో పోస్ట్ చేసి ‘Hope you’re okay @michaelvaughan’ అని పేర్కొన్నారు. గతంలోనూ IND, ENG మ్యాచుల సందర్భంలో పుష్ప, జవాన్ మీమ్స్‌తో వసీం ట్రోల్ చేశారు.


