News May 1, 2024
సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల కేసు.. కస్టడీలో నిందితుడి సూసైడ్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల్లో ఒకడైన అనుజ్ థాపన్ పోలీసుల కస్టడీలో ఆత్మహత్య చేసుకున్నాడు. సల్మాన్ ఇంటి వద్ద కాల్పులకు పాల్పడిన ఇద్దరు షూటర్లకు అనుజ్ ఆయుధాలు సమకూర్చినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిని అరెస్ట్ చేయగా.. ఇవాళ అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Similar News
News January 20, 2026
గుంటూరు మిర్చికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు

పత్తి, మిర్చి వంటి వాణిజ్య పంటలను ఒకే సమగ్ర మిషన్‌లోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. సాగు ఖర్చు తగ్గింపు, దిగుబడి పెంపు, మార్కెటింగ్, ఎగుమతులు, ప్రాసెసింగ్‌కు ఊతం ఇవ్వాలన్నది లక్ష్యం. గుంటూరు మిర్చికి జాతీయ మద్దతు లభించే అవకాశం ఉంది. పరిశోధనలు, ల్యాబ్లు, గ్రేడింగ్ సౌకర్యాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇది అమలైతే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యవసాయానికి కొత్త ఊపిరి అందనుంది.
News January 20, 2026
గ్రీన్‌లాండ్‌కు US యుద్ధ విమానం.. బలగాలను పెంచిన డెన్మార్క్

గ్రీన్‌లాండ్‌లోని పిటుఫిక్ స్పేస్ బేస్‌కు అమెరికా తన యుద్ధ విమానాన్ని పంపింది. నార్త్ అమెరికా రక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు NORAD తెలిపింది. మరోవైపు డెన్మార్క్ కూడా గ్రీన్‌లాండ్‌కు అదనపు సైన్యాన్ని, మిలిటరీ ఎక్విప్‌మెంట్‌ను తరలించింది. గ్రీన్‌లాండ్‌ను దక్కించుకోవాలని ట్రంప్ చూస్తున్న తరుణంలో ఇరు దేశాలు తమ మిలిటరీ పవర్‌ను పెంచడం ఉత్కంఠ రేపుతోంది.
News January 20, 2026
HURLలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

హిందుస్థాన్ ఉర్వరిక్& రసాయన్ లిమిటెడ్ (<


