News August 13, 2024

‘దేవర-1’లో నా పాత్ర షూటింగ్ పూర్తి: NTR

image

కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ‘దేవర-1’ సినిమాలోని తన పాత్ర షూటింగ్ పూర్తయినట్లు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలిపారు. చివరి షాట్‌లో డైరెక్టర్‌తో డిస్కస్ చేస్తున్న ఫొటోను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘ఈ ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగింది. సముద్రమంత ప్రేమను, అద్భుతమైన బృందాన్ని మిస్ అవుతా. సెప్టెంబరు 27న శివ రూపొందించిన ప్రపంచాన్ని అందరితో కలిసి చూసేందుకు వేచిచూస్తున్నా’ అని పేర్కొన్నారు.

Similar News

News December 5, 2025

8ఏళ్లైనా పూర్తికాని WGL కమిషనరేట్ పనులు!

image

కమిషనరేట్ నూతన భవన నిర్మాణానికి 2017లో భూమిపూజ జరిగినా, ఎనిమిదేళ్లు కావస్తున్నా పనులు పూర్తి కాలేదు. దీంతో శాఖలకు చాంబర్లు, కార్యాలయాలు లేక ఇబ్బందులు అధికమవుతున్నాయి. పాత హెడ్ క్వార్టర్స్<<18473913>> భవనాల్లో తగిన స్థలం<<>> లేకపోవడంతో CP, DCPలు, అనేక విభాగాలు గదులు పంచుకొని పనిచేస్తున్న పరిస్థితి ఉంది. నిర్మాణం ఆలస్యం కారణంగా పోలీసులు రోజువారీ పనుల్లో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి.

News December 5, 2025

బెంజ్, రేంజ్ రోవర్ కాకుండా ఫార్చునర్.. అందుకేనా?

image

నిన్న మోదీ, పుతిన్ టయోటా ఫార్చునర్ కారులో ప్రయాణించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. రేంజ్ రోవర్, బెంజ్ లాంటి లగ్జరీ కార్లు ఉన్నప్పటికీ వారు ఫార్చునర్‌లోనే ప్రయాణించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా 2022లో అమెరికాతో పాటు యూరప్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. దీంతో ఆ దేశాల కార్లు కాకుండా జపాన్‌కు చెందిన టయోటాను ఎంచుకుని మోదీ, పుతిన్ వారికి బలమైన సందేశం పంపినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.

News December 5, 2025

ఫ్రెండ్‌తో అన్నీ పంచుకుంటున్నారా?

image

స్నేహితుల మధ్య దాపరికాలు ఉండవు. కానీ ఆ చెప్పే విషయాల్లో భార్యాభర్తల అనుబంధాన్నీ చేర్చవద్దంటున్నారు నిపుణులు. వారి మధ్య జరిగే విషయాల్ని మూడోవ్యక్తితో చర్చించకపోవడమే మంచిదంటున్నారు. భాగస్వామితో చిన్న గొడవ గురించి స్నేహితులకు చెబితే మీవారిపై నెగెటివ్ అభిప్రాయం వచ్చే అవకాశం ఉంది. ప్రతిదానికీ బయటివారి సలహాలు కోరుతూ ఉంటే నమ్మకం పోవడమే కాదు.. ఇతరులకీ చులకన అవుతారు. మరిన్ని గొడవలకూ కారణమవొచ్చు.