News April 8, 2024
రాజమండ్రిలో ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్ ఈనెల మూడో వారం నుంచి రాజమండ్రిలో జరగనుంది. ఆ తర్వాత వైజాగ్‌లోనూ కొన్ని సీన్లు చిత్రీకరించనున్నట్లు సమాచారం. దాదాపు 10 రోజులపాటు ఈ షెడ్యూల్ ఉంటుందని సినీవర్గాలు తెలిపాయి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. OCT31న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Similar News
News November 2, 2025
అడుగు దూరంలో ట్రోఫీ.. నేడే ఫైనల్

ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ ఆఖరి మజిలీకి చేరుకుంది. దశాబ్దాల ఎదురుచూపులకు తెరపడటానికి కొన్ని గంటలే మిగిలున్నాయి. నవీ ముంబయి వేదికగా WC ఫైనల్లో హర్మన్ ప్రీత్ సేన SAతో తలపడనుంది. ఎవరు గెలిచినా వారికి ఇదే తొలి WC అవుతుంది. రెండుసార్లు ట్రోఫీకి అడుగుదూరంలో ఆగిపోయిన భారత మహిళల జట్టు ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో లైవ్ చూడొచ్చు.
News November 2, 2025
మహేశ్‌ని అలా ఎప్పుడూ అడగలేదు: సుధీర్ బాబు

తన సినిమాల్లో హిట్లున్నా, ఫ్లాపులున్నా పూర్తి బాధ్యత తనదేనని హీరో సుధీర్ బాబు ‘జటాధర’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పేర్కొన్నారు. ‘కృష్ణకు అల్లుడు, మహేశ్‌కు బావలా ఉండటం గర్వకారణం, ఓ బాధ్యత. కృష్ణానగర్‌లో కష్టాలు నాకు తెలియదు. కానీ, ఫిల్మ్‌నగర్ కష్టాలు నాకు తెలుసు. నాకో పాత్రగానీ, సినిమాగానీ రికమెండ్ చేయమని నేను మహేశ్‌ను ఎప్పుడూ అడగలేదు’ అని తెలిపారు. జటాధర మూవీ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
News November 2, 2025
ధ్వజస్తంభాన్ని ఎలా తయారుచేస్తారు?

ధ్వజస్తంభాన్ని పలాస, రావి, మారేడు వంటి పవిత్ర వృక్షాల కలపతో తయారుచేసి, ఇత్తడి లేదా బంగారు తొడుగు వేస్తారు. దీని కింద వైష్ణవాలయాల్లో సుదర్శన చక్రం, శివాలయాల్లో నందీశ్వరుని చిహ్నాలు ఉంటాయి. దీనికి జీవధ్వజం అనే పేరు కూడా ఉంది. గోపుర కలశం కంటే ధ్వజస్తంభం ఎత్తుగా ఉంటే ఉత్తమమని శాస్త్రాలు చెబుతున్నాయి. ధ్వజస్తంభం పవిత్రత, శక్తిని కలిగి ఉండటానికి నిత్య అనుష్ఠానాల వల్ల భగవంతుని చూపు దీనిపై పడుతుంది.


