News December 2, 2024

‘హరిహర వీరమల్లు’ షూటింగ్.. పవన్ సెల్ఫీ

image

పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఆయన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. వీరమల్లు గెటప్‌లో తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేశారు. ‘బిజీ పొలిటికల్ షెడ్యూల్ తర్వాత చివరకు నేను చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పని కోసం నా సమయాన్ని కొన్ని గంటలు ఇవ్వగలుగుతున్నా’ అని పేర్కొన్నారు.

Similar News

News November 18, 2025

చలికి చర్మం పగులుతుందా?

image

చలి పెరగడంతో శరీరం పగిలి ఇబ్బందిపడుతున్నారు. అలాంటి వారు ఇంట్లోనే చిట్కాలు పాటించి చర్మాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘రోజుకు కనీసం రెండుసార్లు స్నానం చేసిన వెంటనే & పడుకునే ముందు మందపాటి, ఆయిల్ ఆధారిత మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి నూనె రాయండి. చలికాలంలో కూడా రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగితే చర్మాన్ని లోపలి నుంచి హైడ్రేట్‌గా ఉంచవచ్చు. గోరువెచ్చని నీటితో స్నానం చేయండి’ అని తెలిపారు.

News November 18, 2025

పాడి పశువులకు మేత, దాణా ఇలా అందిస్తే మంచిది(1/2)

image

పాడి పశువులకు వరిగడ్డి, చొప్పలాంటి ఎండు మేతతో పాటు తప్పనిసరిగా పచ్చిమేత ఉండాలి. పశువు శరీర బరువు, పాల మోతాదును అనుసరించి మేత అందిస్తే దాని పాల ఉత్పత్తి పెరుగుతుంది. పాడి పశువు ప్రతి 45 కిలోల శరీర బరువుకు 1-1.5 కిలోల ఎండు మేత, 3-5 కిలోల పచ్చిమేత తింటుంది. నాలుగు లీటర్ల లోపు పాలిచ్చే పశువులకు సాధారణంగా 4-5 కిలోల ఎండుగడ్డి, 1-1.5 కిలోల దాణా మిశ్రమం సరిపోతుంది. ఎక్కువగా ఇచ్చి వృథా చేయకూడదు.

News November 18, 2025

పాడి పశువులకు మేత, దాణా ఇలా అందిస్తే మంచిది(2/2)

image

5 లీటర్ల కంటే ఎక్కువ పాలిచ్చే ఆవులకు.. అదనంగా ఇచ్చే ప్రతి 3 లీటర్ల పాలకు ఒక కిలో చొప్పున దాణా ఎక్కువగా ఇవ్వాలి. అదే విధంగా 5 లీటర్ల కంటే ఎక్కువ పాలిచ్చే గేదెలకు.. అదనంగా వచ్చే ప్రతి 2.5 లీటర్ల పాల ఉత్పత్తికి ఒక కిలో చొప్పున దాణా ఎక్కువగా ఇవ్వాలి. పశువుకు కావలసిన దాణాను 2 సమాన భాగాలుగా చేసి ఉదయం, సాయంత్రం పాలు పితికే సమయానికి అరగంట ముందు అందివ్వాలి. ఈ విధంగా పశువుల అవసరాన్నిబట్టి మేత అందించాలి.