News August 11, 2025
నేటి నుంచి షూటింగ్స్ బంద్.. నేతలు పరిష్కారం చూపేనా?

టాలీవుడ్‌లో సినీ కార్మికుల వేతనాల సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. తమ డిమాండ్లకు నిర్మాతలు ఒప్పుకోకపోవడంతో ఇవాళ్టి నుంచి షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ ప్రకటించారు. ఇవాళ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో ఫెడరేషన్ నాయకులు సమావేశం కానున్నారు. మరోవైపు ఇదే విషయమై నిర్మాతలు ఏపీ మంత్రి దుర్గేశ్‌ని కలుస్తారని తెలుస్తోంది. నాయకులైనా ఈ బంద్‌కు శుభం పలుకుతారేమో చూడాలి.
Similar News
News August 11, 2025
మాజీ ఉపరాష్ట్రపతి ఎక్కడంటూ అమిత్ షాకు లేఖ

మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఎక్కడ ఉన్నారో క్లారిటీ ఇవ్వాలని శివసేన MP సంజయ్ రౌత్ హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. ‘JUL 21న రాజీనామా చేసినప్పటి నుంచి ధన్‌ఖడ్ గురించి ఎలాంటి సమాచారం లేదు. ఆయన ఆరోగ్యం తదితర పూర్తి వివరాలను నిజాయితీగా వెల్లడించాలి. కొందరు ఎంపీలు సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయాలని నిర్ణయించారు. కానీ ముందు మిమ్మల్ని అడగాలని నేను డిసైడ్ అయ్యా’ అని రాసుకొచ్చారు.
News August 11, 2025
హార్దిక్‌కు షాక్.. గిల్‌కు ప్రమోషన్!

ఆసియా కప్‌లో గిల్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాండ్య స్థానంలో ఈ యంగ్ ప్లేయర్‌ను VCగా నియమిస్తారని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. జట్టు భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆయనకు వైస్ బాధ్యతలు అప్పగిస్తారని చెప్పాయి. ENGతో టెస్టు సిరీస్‌లో గిల్ కెప్టెన్‌గా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. గాయం నుంచి కోలుకుంటున్న T20 కెప్టెన్ సూర్య టోర్నీ ప్రారంభంలోపు ఫిట్ అవుతారని తెలిపాయి.
News August 11, 2025
కాంగ్రెస్ చేతకానితనంతో ఎకానమీ పతనమవుతోంది: KTR

TG: కాంగ్రెస్ పాలనపై BRS నేత KTR ఫైరయ్యారు. CAG తాజా నివేదిక ప్రమాద ఘంటికలు మోగిస్తోందన్నారు. ‘6 గ్యారంటీలకు బదులు ఫెయిల్డ్ ఎకానమీని ఇచ్చారు. కాంగ్రెస్ చేతకానితనంతో రాష్ట్ర ఎకానమీ పతనమవుతోంది. తొలి క్వార్టర్‌లోనే రూ.10,583 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ ఉంది. ఒక్క రోడ్డు వేయకుండా, ప్రాజెక్టు స్టార్ట్ చేయకుండా, స్టూడెంట్స్‌కు సరైన తిండి పెట్టకుండానే రూ.20,266 కోట్ల అప్పు చేశారు’ అని Xలో దుయ్యబట్టారు.