News August 10, 2025
చర్చలు ఫలించకుంటే.. రేపటి నుంచి షూటింగ్‌లు బంద్: ఫిల్మ్ ఫెడరేషన్

TG: వేతనాలు పెంచాలని సినీ కార్మికులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా రేపటి నుంచి చిత్రీకరణలు పూర్తిగా నిలిపేస్తున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ ప్రకటించారు. ఇప్పటికే షెడ్యూల్ ఉంటే 2 రోజులు సమయమిస్తామని, ఆ తర్వాత అవి కూడా నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈరోజు జరిగే చర్చలపైనే ఇదంతా ఆధారపడి ఉంటుందని తెలిపారు. కార్మికుల శ్రమకు తగిన వేతనాల కోసమే తాము ఈ పోరాటం చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
Similar News
News August 12, 2025
అటవీశాఖలో ఉద్యోగాల భర్తీ చేపట్టాలి: రేవంత్

TG: అటవీశాఖలో ప్రమోషన్లతో పాటు ఉద్యోగాల భర్తీ చేపట్టాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. మంత్రి సురేఖతో కలిసి ఆయన ఎకో టూరిజం అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ‘ఆమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులకు సందర్శకులను పెంచాలి. నైట్ సఫారీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. అటవీ-రెవెన్యూ శాఖల మధ్య భూవివాదాలు పరిష్కారం చేయాలి’ అని ఆయన ఆదేశించారు.
News August 12, 2025
రికార్డులు కొల్లగొట్టిన డెవాల్డ్ బ్రెవిస్

AUSతో 2వ T20లో సౌతాఫ్రికా బ్యాటర్ బ్రెవిస్(125*) విధ్వంసం సృష్టించారు. దీంతో SA తరఫున అత్యధిక T20 వ్యక్తిగత స్కోర్(గతంలో డుప్లెసిస్ 119 రన్స్) కొట్టారు. AUSపై ఫాస్టెస్ట్ సెంచరీ 41బంతుల్లో(గతంలో కోహ్లీ 52బాల్స్), SA తరఫున సెంచరీ కొట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కారు(గతంలో రిచర్డ్ లెవి 24Y). కాగా బ్రెవిస్ IPLలో CSKకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
News August 12, 2025
కాసేపట్లో వర్షం

తెలంగాణలోని పలు జిల్లాల్లో రాత్రి 10 గంటల లోపు వర్షం కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. కొత్తగూడెం, జగిత్యాల, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో మోస్తరు వాన పడొచ్చని పేర్కొంది. మరి మీ ఏరియాలో వర్షం మొదలైందా? కామెంట్ చేయండి.