News September 23, 2024
పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా?

దసరా, దీపావళి పండుగలు వచ్చేస్తుండటంతో ఈ-కామర్స్ సంస్థలు భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తాయి. ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు అధికారిక వెబ్‌సైట్లలోనే కొనుగోలు చేయాలి. మెసేజ్, ఈ-మెయిళ్లకు స్పందించకపోవడం ఉత్తమం. స్పందిస్తే మీ బ్యాంకు ఖాతాలో డబ్బు మాయమయ్యే అవకాశం ఉంది. అన్ని పోర్టల్‌లకు ఒకే పాస్ వర్డ్ ఉపయోగించకూడదు. ఫ్రీ హాట్‌స్పాట్‌లు ఉపయోగించి షాపింగ్ చేయొద్దు. హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉంది.
Similar News
News January 10, 2026
MSVG టికెట్ ధరల పెంపు.. రెండు రోజుల కిందటే అనుమతి?

చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా టికెట్ ధరల <<18817046>>పెంపునకు<<>> TG ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఈ నెల 8వ తేదీ ఉండటంతో 2 రోజుల కిందటే టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. కాసేపట్లో టికెట్ బుకింగ్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తాజాగా జీవో బయటకు రావడం చర్చనీయాంశమైంది. ఈ మూవీ ఎల్లుండి థియేటర్లలోకి రానుండగా, రేపు ప్రీమియర్లు వేయనున్నారు.
News January 10, 2026
మార్స్‌కైనా వెళ్లాల్సిందే: బంగ్లా క్రికెటర్

భారత్‌తో సంబంధాలు దెబ్బతినడంతో మన దేశంలో T20WC ఆడేందుకు <<18807855>>BCB <<>>నిరాకరించిన విషయం తెలిసిందే. దీనిపై వరల్డ్ కప్ కోసం ఎంపికైన బంగ్లా ఆల్రౌండర్ మహెదీ హసన్ స్పందించారు. ‘అనిశ్చితి అనేది మేనేజ్మెంట్ సమస్య. దానిని అఫీషియల్స్ డీల్ చేయాల్సి ఉంటుంది. మా పని క్రికెట్ ఆడటం మాత్రమే. మీరు ఆటగాళ్లను మార్స్‌కు పంపినా వెళ్లి ఆడతారు. దానిపై వారికి ఎలాంటి అభ్యంతరం ఉండదు’ అని వ్యాఖ్యానించారు.
News January 10, 2026
మరోసారి చర్చకు టికెట్ రేట్ల పెంపు!

ప్రీమియర్ షోలు, టికెట్ రేట్ల పెంపుపై TG ప్రభుత్వ నిర్ణయాలు అభిమానులను అయోమయానికి గురిచేస్తున్నాయి. మొన్న అర్ధరాత్రి జారీ చేసిన ‘రాజాసాబ్’ టికెట్ రేట్ల పెంపు మెమోను నిన్న HC సస్పెండ్ చేసింది. జీవో 120 ప్రకారం టికెట్ రేట్ రూ.350 మించకూడదని స్పష్టం చేసింది. ఇంతలోనే తాజాగా ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా ప్రీమియర్స్‌కు <<18817046>>అనుమతి<<>> ఇవ్వడం, టికెట్ రేట్‌ను రూ.600గా నిర్ణయించడంపై విమర్శలు వస్తున్నాయి. COMMENT


