News August 8, 2024
కట్టుబట్టలతో ఇండియాకు.. రూ.30వేలతో షాపింగ్!

ఆందోళనకారుల హింస మధ్య అకస్మాత్తుగా దేశాన్ని వీడిన బంగ్లా మాజీ పీఎం షేక్ హసీనా కట్టుబట్టలతో ఇండియాకు వచ్చారు. ప్రాణ భయంతో దుస్తులు, వ్యక్తిగత వస్తువులు సైతం వెంట తెచ్చుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో హసీనా యూపీలోని హిండన్ ఎయిర్బేస్లో రూ.30వేలతో షాపింగ్ చేసినట్లు పేర్కొన్నాయి. ఈరోజు ఆమె లండన్ వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Similar News
News November 16, 2025
ఈరోజు వీటిని తినకూడదట.. ఎందుకంటే?

కార్తీక మాసంలో ఆదివారం రోజున ఉసిరి, కొబ్బరిని ఆహారంగా తీసుకోకూడదని పండితులు చెబుతున్నారు. ‘ఉసిరి చెట్టు లక్ష్మీదేవి స్వరూపం. విష్ణు కొలువై ఉండే వృక్షంగా దీన్ని భావిస్తారు. కొబ్బరి కూడా పవిత్రమైన పూజా ద్రవ్యం. సూర్యభగవానుడికి అంకితమైన ఈ ఆదివారం రోజున ఈ పవిత్ర వృక్షాలను గౌరవించాలి. వాటి ఫలాలను ఆహారంగా స్వీకరించడం ధర్మం కాదని గ్రహించాలి. ఈ నియమాలు పాటిస్తే శుభాలు కలుగుతాయి’ అని సూచిస్తున్నారు.
News November 16, 2025
ఆవుండగా గాడిద పాలు పితికినట్లు

ఒక పనిని సులభంగా, సరైన మార్గంలో చేసే అవకాశం లేదా వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ.. దానిని విస్మరించి, కష్టమైన, పనికిరాని, అసాధ్యమైన మార్గాన్ని ఎంచుకున్న సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. అందుబాటులో ఉన్న మంచి అవకాశాన్ని వదులుకుని అనవసరమైన శ్రమకు పోవడాన్ని ఈ సామెత సూచిస్తుంది.
News November 16, 2025
వణికిస్తున్న చలి.. పడిపోయిన ఉష్ణోగ్రతలు

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 3-5 డిగ్రీల మేర తగ్గిపోయాయి. దీంతో APలోని అల్లూరి(D) అరకులో అత్యల్పంగా 7 డిగ్రీలు నమోదయ్యాయి. TGలోని సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో 8.1 డిగ్రీలు రికార్డయ్యాయి. ఆసిఫాబాద్లో 8.4, ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 8.6 చొప్పున నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపింది.


