News November 5, 2024

ఆడవాళ్లతో షాపింగ్.. 26 నిమిషాలే ఇంట్రెస్ట్!

image

ఆడవాళ్లతో కలిసి గంటల తరబడి షాపింగ్‌ అంటే మగవాళ్లు ఓ అడుగు వెనకే ఉంటారు. UKకు చెందిన క్విడ్‌కో అధ్యయనం ప్రకారం మగవాళ్లు 26 నిమిషాల్లో షాపింగ్‌‌పై ఆసక్తి కోల్పోతారు. నలుగురిలో ఒకరు తమ భాగస్వాములను మధ్యలోనే వదిలేస్తారు. బిజీ స్టోర్‌లు, ఆకలి, స్పోర్ట్స్ మిస్ అవడం వల్ల పురుషులు షాపింగ్ టైమ్‌లో అసహనానికి గురవుతారు. దీంతో సగం మంది పార్ట్‌నర్‌తో వాగ్వాదానికి దిగినట్లు అంగీకరించారు. మరి దీనిపై మీరేమంటారు?

Similar News

News November 27, 2025

వారికి నిద్ర అవసరం: సుందర్ పిచాయ్

image

‘జెమిని 3’ మోడల్‌ కోసం తన బృందం కొన్ని వారాల పాటు విరామం లేకుండా పని చేసిందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ‘ఉద్యోగులంతా ఎంతో అలసిపోయారు. కొందరికి నిద్ర అవసరం. ఇప్పుడు తగిన విశ్రాంతి దొరుకుతుందని ఆశిస్తున్నా’ అని చెప్పారు. ‘గూగుల్ ఏఐ: రిలీజ్ నోట్స్’ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడారు. జెమిని 3 ఏఐ మోడల్‌ను ఇటీవల గూగుల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

News November 27, 2025

నిర్మాతలను బ్లేమ్ చేయొద్దు: SKN

image

కంఫర్ట్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తూ ప్రొడ్యూసర్స్‌‌ను బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని ప్రేక్షకులనుద్దేశించి నిర్మాత SKN పేర్కొన్నారు. ‘మనం కంఫర్ట్, లగ్జరీ కావాలి అనుకున్నప్పుడే ఎక్కువ పే చేయాలి. కేవలం కంఫర్ట్ కోసమే ఎక్స్‌ట్రా చెల్లిస్తున్నాం. లగ్జరీ థియేటర్లో చూడాలంటే రియల్‌ఎస్టేట్ వాల్యూ ప్రకారం టికెట్, రిఫ్రెష్‌మెంట్ రేట్లుంటాయి. వాటితో నిర్మాతకొచ్చే ఎక్స్‌ట్రా బెనిఫిట్ ఏమీ ఉండదు’ అని తెలిపారు.

News November 27, 2025

ఈనెల 29న ఆన్‌లైన్ జాబ్ మేళా

image

AP: పార్వతీపురం ఎంప్లాయిమెంట్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఈ నెల 29న ఆన్‌లైన్ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా HDB ఫైనాన్స్ కంపెనీలో 41 బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనున్నారు. 18ఏళ్లు పైబడిన డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. జాబ్ మేళా రిజిస్ట్రేషన్ లింక్: https://forms.gle/vtBSqdutNxUZ2ESX8