News April 29, 2024
నీళ్లు, విద్యుత్ కొరత.. ఓయూలో హాస్టళ్లు, మెస్సులు బంద్

TG: ఉస్మానియా యూనివర్సిటీలోని హాస్టళ్లు, మెస్సులకు అధికారులు వేసవి సెలవులు ప్రకటించారు. వీటిని మే 1 నుంచి మే 31వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు తెలిపారు. అలాగే వర్సిటీలో నీళ్లు, విద్యుత్ కొరత ఉందని పేర్కొన్నారు. విద్యార్థులంతా సహకరించాలని కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా వర్సిటీ హాస్టళ్లలో నీటి కొరతపై ఇటీవల విద్యార్థులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే.
Similar News
News January 2, 2026
చిన్నారితో రేణూ దేశాయ్.. ఫొటోలు వైరల్

న్యూ ఇయర్ సందర్భంగా నటి రేణూ దేశాయ్ ఓ బాబును ఆడిస్తూ తీసుకున్న ఫొటోలను ఇన్స్టాలో షేర్ చేశారు. ‘పసివాళ్లు దేవదూతల్లా ఉంటారు. ఈ చిన్నారి బాలుడు తన క్యూట్నెస్తో నా మనసు దోచుకున్నాడు’ అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఆ పిల్లాడు ఎవరని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ పోస్టుకు ఆమె కామెంట్స్ ఆఫ్ చేయడం గమనార్హం. కాగా ప్రస్తుతం ఆమె ‘పదహారు రోజుల పండగ’ అనే సినిమాలో నటిస్తున్నారు.
News January 2, 2026
రేవంత్రెడ్డిని రెండు సార్లు ఉరితీయాలి: కవిత

TG: MLC కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. KCRను ఉరితీయాలని రేవంత్ అనడం సరికాదని, ఉద్యమకారుడిని అలా అంటే రక్తం మరుగుతుందన్నారు. రేవంత్ రెడ్డిని ఒకసారి కాదు, రెండు సార్లు ఉరితీయాలంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అక్రమాలపై ప్రశ్నలు లేవనెత్తిన కవిత, BRS మనుగడ కోసం కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరారు. తన రాజీనామా ఆమోదం కోసం మండలికి వచ్చిన ఆమె ఈ విధంగా కామెంట్స్ చేశారు.
News January 2, 2026
నువ్వుల పంటలో బిహారీ గొంగళి పురుగు – నివారణ

నువ్వుల పంట తొలిదశలో చిన్న గొంగళి పురుగులు ఆకు పత్రహరితాన్ని గోకి తినడం వల్ల ఆకులు జల్లెడలా మారతాయి. ఎదిగిన గొంగళి పురుగులు మొగ్గలకు, పువ్వులకు, కాయలకు రంధ్రాలు చేసి విత్తనాలను తింటాయి. వీటి నివారణకు ఎకరాకు 16- 20 పక్షి స్థావరాలను, హెక్టారుకు ఒక దీపపు ఎరను అమర్చాలి. తొలుత లీటరు నీటికి వేపనూనె 5mlను, తర్వాతి దశలో లీటరు నీటికి క్లోరిఫైరిపాస్ 2.5ml లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.


