News September 4, 2024
బెజవాడలోనూ ‘హైడ్రా’ తరహా వ్యవస్థ రావాల్సిందేనా?

AP: బుడమేరు వాగును ఆక్రమించి ఇళ్లు కట్టడంతోనే బెజవాడ నీటమునిగినట్లు తెలుస్తోంది. కొందరు ప్రజాప్రతినిధులు, వ్యాపారులు బుడమేరును ఆక్రమించి వెంచర్లు వేశారు. తక్కువ ధరకు దొరుకుతున్నాయని మధ్యతరగతి ప్రజలు అక్కడ ప్లాట్లు కొని ఇళ్లు కట్టుకున్నారు. క్రమక్రమంగా అవి పెద్దపెద్ద కాలనీలుగా విస్తరించాయి. దీంతో ఇక్కడా హైడ్రా తరహా వ్యవస్థ రావాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News December 15, 2025
దురదృష్టం.. ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీ చేసినా

TG: సూర్యాపేటలోని గుడిబండ గ్రామంలో ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన వెంకటేశ్వర్లుకు దురదృష్టం వెంటాడింది. కేవలం పది ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మంత్రి ఉత్తమ్, ఆయన సతీమణి పద్మావతి వ్యక్తిగతంగా మద్దతు తెలిపినా వెంకటేశ్వర్లుకు పరాజయం తప్పలేదు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి నాగయ్య చేతిలో ఓడారు. వెంకటేశ్వర్లు పదవీకాలం మరో 5 నెలల్లో ముగియనుండగా VRS తీసుకొని పోటీ చేశారు.
News December 15, 2025
చిరంజీవికి ఆ లుక్ వద్దని చెప్పా: అనిల్ రావిపూడి

‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా కోసం చిరంజీవి ‘సాల్ట్ అండ్ పెప్పర్’ లుక్ ప్రయత్నిస్తానన్నారని, తానే వద్దని చెప్పినట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. బయట ఎలా ఉన్నారో సినిమాలో అలానే చూపిస్తానని చెప్పానని అనిల్ అన్నారు. కాగా ఈ మూవీలో వెంకీ-చిరు కాంబినేషన్లో 20 నిమిషాల సీన్స్ ఉంటాయని చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానుండగా, ఇప్పటికే వెంకీ రోల్ షూటింగ్ పూర్తయిన సంగతి తెలిసిందే.
News December 15, 2025
డిసెంబర్ 15: చరిత్రలో ఈరోజు

✪ 1933: సినీ దర్శకుడు బాపు జననం
✪ 1950: భారత తొలి ఉపప్రధాని సర్దార్ వల్లభాయి పటేల్ మరణం (ఫొటోలో)
✪ 1952: ప్రత్యేకాంధ్ర పోరాటయోధుడు పొట్టి శ్రీరాములు మరణం
✪ 1973: మూవీ డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా జననం
✪ 1990: హీరోయిన్ లావణ్య త్రిపాఠి జననం
✪ 2014: సంగీత దర్శకుడు చక్రి మరణం


