News January 7, 2025

నిధులన్నీ కుంభమేళాకేనా.. గంగాసాగర్ మేళాకు ఇవ్వరా?: మమత బెనర్జీ

image

UPలో కుంభ‌మేళాకు వేల కోట్ల నిధులిచ్చే NDA ప్ర‌భుత్వం బెంగాల్‌లో జ‌రిగే గంగాసాగ‌ర్ మేళాకు ఎందుకివ్వదని CM మ‌మ‌తా బెనర్జీ ప్ర‌శ్నించారు. ఒక వైపు మడ అడవులు, మరో వైపు సముద్రం ఉండే గంగాసాగర్‌కు నీటి మార్గంలో చేరుకోవాల‌న్నారు. ఇక్కడ కేంద్రం బ్రిడ్జి నిర్మించకపోవడంతో తమ ప్రభుత్వమే ఆ పని చేస్తోందన్నారు. గంగా న‌ది-బంగాళాఖాతం క‌లిసే చోటును గంగాసాగ‌ర్‌గా పిలుస్తారు. ఇక్కడ ఏటా సంక్రాంతికి జాత‌ర జ‌రుగుతుంది.

Similar News

News November 21, 2025

వేములవాడ: సాధారణ కుటుంబం నుంచి ఐపీఎస్..!

image

వేములవాడ <<18349816>>ఏఎస్పీగా<<>> నియమితులైన కొట్టే రిత్విక్ సాయి సామాన్య కుటుంబం నుంచి ఐపీఎస్ అధికారిగా ఎదిగారు. వరంగల్‌కు చెందిన ఈయన.. శ్రీనివాస గురుకుల్ పాఠశాలలో టెన్త్ వరకు, HYDలో ఇంటర్, ఢిల్లీ శివనాడార్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్‌లో బీటెక్ చేశారు. 2023వ బ్యాచ్‌లో TG క్యాడర్ IPS అధికారిగా ఎంపికయ్యారు. తండ్రి రాధాకృష్ణారావు లైబ్రేరియన్, తల్లి గృహిణి, సోదరి వైద్యురాలిగా పనిచేస్తారు.

News November 21, 2025

హారతిని కళ్లకు అత్తుకుంటున్నారా?

image

చాలామంది హారతిని కళ్లకు అత్తుకుంటారు. అయితే ఇలా చేయకూడదని పండితులు చెబుతున్నారు. దేవుడికి దిష్టి తీయడం కోసమే హారతి ఇస్తారని, దాన్ని కళ్లకు అత్తుకోకూడదని సూచిస్తున్నారు. ‘ఇంట్లో, చిన్న పిల్లలకు చెడు దృష్టి తగలకుండా దిష్టి తీసినట్లే స్వామివారికి దృష్టి దోషం పోవడానికే హారతి ఇస్తారు. అందులో ఏ సానుకూల శక్తి ఉండదు. దిష్టి తీసిన గుమ్మడికాయను వదిలేసినట్లే హారతిని కూడా వదిలేయాలి’ అని వివరిస్తున్నారు.

News November 21, 2025

RRB-NTPC ఫలితాలు విడుదల

image

RRB-NPTC 3,445 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి సీబీటీ 1 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టినతేదీ ఎంటర్ చేసి https://indianrailways.gov.in/లో ఫలితాలు తెలుసుకోవచ్చు. మొత్తం 27.55లక్షల మంది పరీక్ష రాయగా.. 51,979మంది సీబీటీ 2కు అర్హత సాధించారు.