News September 20, 2024
కోకకోలా, పెప్సీ డిస్కౌంట్లు ఇవ్వాల్సిందేనా ఇక!

కూల్‌డ్రింక్స్ మార్కెట్లో డిస్కౌంట్లు, ప్రైస్‌వార్ షురూ కానుంది! కాంపాకోలాను రిలయన్స్ కొత్త మార్కెట్లకు విస్తరిస్తుండటం, కోకకోలా, పెప్సీతో పోలిస్తే సగం ధరకే అమ్మడం ఇందుకు కారణాలు. పండగల సీజన్లో సాఫ్ట్ డ్రింక్స్‌కు డిమాండ్ పెరుగుతుంది. ఈ టైమ్‌లో తూర్పు, మధ్య, దక్షిణ భారతంలో RIL సప్లై పెంచుతోంది. దీంతో ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న ప్రత్యర్థి కంపెనీలు ఇకపై ధరలు తగ్గించక తప్పని పరిస్థితి నెలకొంది.
Similar News
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.
News December 2, 2025
ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్: కేంద్రం

గత ఐదేళ్లలో దేశంలో 2,04,268 ప్రైవేట్ కంపెనీలు మూతపడ్డాయని లోక్‌సభలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా వెల్లడించారు. విలీనాలు, రిజిస్ట్రేషన్ రద్దు వంటి రీజన్స్‌తో ఇవి క్లోజ్ అయ్యాయని తెలిపారు. అత్యధికంగా 2022-23లో 83,452, అత్యల్పంగా 2020-21లో 15,216 కంపెనీలు మూత పడ్డాయని పేర్కొన్నారు. ఆయా సంస్థల ఉద్యోగులకు పునరావాసం కల్పించే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని చెప్పారు.


