News July 11, 2024
డెస్కాటేను తీసుకోవాలన్న గంభీర్?

భారత క్రికెట్ జట్టు కోచ్‌గా ఎంపికైన గౌతం గంభీర్ BCCIకి వరుస షరతులు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అసిస్టెంట్ కోచ్‌గా అభిషేక్ నాయర్‌ను ఎంపిక చేయాలన్న గౌతీ ఇప్పుడు నెదర్లాండ్స్ మాజీ క్రికెటర్ టెన్ డెస్కాటేను సపోర్ట్ స్టాఫ్‌గా తీసుకోవాలని కోరారట. ఈ ముగ్గురూ KKRకి చెందిన వారే కావడం గమనార్హం. ఇటీవల ఎక్కువగా స్వదేశీ కోచ్‌లకే ప్రాధాన్యమిస్తున్న BCCI ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Similar News
News January 21, 2026
ICC నం.1 బ్యాటర్‌గా మిచెల్

టీమ్ ఇండియాతో వన్డే సిరీస్‌లో అదరగొట్టిన న్యూజిలాండ్ బ్యాటర్ మిచెల్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నం.1 స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఇది వరకు టాప్ ప్లేస్‌లో ఉన్న విరాట్ కోహ్లీ రెండో స్థానానికి పడిపోయారు. అఫ్గానిస్థాన్ ప్లేయర్ ఇబ్రహీం జద్రాన్ టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మను వెనక్కినెట్టి 3వ స్థానానికి చేరుకున్నారు. కాగా భారత్‌తో వన్డే సిరీస్‌లో మిచెల్ రెండు సెంచరీలు బాదిన విషయం తెలిసిందే.
News January 21, 2026
రైలును పట్టాలు తప్పించే కుట్ర!

మహారాజా ఎక్స్‌ప్రెస్‌కు పెను ముప్పు తప్పింది. రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలో రైలును పట్టాలు తప్పించేందుకు దుండగులు కుట్ర చేశారు. పట్టాలపై ఇనుప కడ్డీలను పెట్టారు. లోకో పైలట్ వెంటనే గుర్తించి ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. నిన్న రాత్రి 11.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సమయంలో రైలులో పెద్ద సంఖ్యలో విదేశీ టూరిస్టులు ఉన్నారు. ఇనుప కడ్డీలను తొలగించి, డాగ్ స్క్వాడ్, పోలీసుల తనిఖీల తర్వాత రైలును పంపారు.
News January 21, 2026
దావోస్‌లో కేటుగాళ్లు.. బిలియనీర్లకే బురిడీ

దావోస్‌లో కేటుగాళ్లు మాటువేశారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో బిలియనీర్లను బురిడీ కొట్టిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశమయ్యేందుకు ‘USA హౌస్’లోకి వీఐపీ యాక్సెస్ కల్పిస్తామని మోసాలకు పాల్పడుతున్నారు. కొందరు స్కామర్లు నకిలీ టికెట్లను విక్రయించడం గమనార్హం. ఈ విషయం బయటపడటంతో జాగ్రత్తగా ఉండాలంటూ బిలియనీర్లను USA హౌస్ హెచ్చరించింది. ‘మోసపోయిన వారికి మా సానుభూతి’ అంటూ పేర్కొంది.


