News March 4, 2025

వారికి ప్రభుత్వ పథకాలు కట్?

image

AP: గంజాయి, డ్రగ్స్ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మాదకద్రవ్యాల కేసుల్లో పట్టుబడిన వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలను నిలిపేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమైనట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. త్వరలోనే క్యాబినెట్‌లో చర్చించి ఆమోదించనున్నట్లు తెలిపాయి.

Similar News

News March 4, 2025

అయోధ్యే కాదు కుంభమేళా పైనా ఉగ్రదాడికి కుట్ర!

image

అయోధ్య రామమందిరంపై దాడికి ప్లాన్ చేసిన టెర్రరిస్టు <<15639611>>అబ్దుల్<<>> రెహ్మాన్‌ అరెస్టు చేయడం ద్వారా ATS, STF భారీ కుట్రల్నే భగ్నం చేశాయి. అతడు ISISలోని ISKP మాడ్యూల్‌కు చెందినవాడిగా తెలిసింది. 18 నెలల క్రితం నెట్‌వర్క్‌లో చేరి ఆన్‌లైన్, వీడియోకాల్స్ ద్వారా ట్రైనింగ్ తీసుకున్నాడు. రామ మందిరంపై దాడికి ఆదేశాలు పొందాడు. ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో లోన్ ఊల్ఫ్ అటాక్ చేసేందుకూ సిద్ధపడ్డాడని సమాచారం.

News March 4, 2025

మద్య నిషేధం ఉన్నప్పటికీ 4 సెకండ్లకో బాటిల్ సీజ్!

image

గుజరాత్‌లో మద్య నిషేధ చట్టం అమలవుతున్న విషయం తెలిసిందే. అక్కడ ఆల్కహాల్ అమ్మినా, కొనుగోలు చేసినా నేరమే. కానీ, అక్కడ ప్రతి 4 సెకండ్లకు ఓ లిక్కర్ బాటిల్ సీజ్ అవుతోంది. 2024లో రూ.144 కోట్లు విలువ చేసే దాదాపు 82 లక్షల బాటిళ్లను సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అహ్మదాబాద్‌ సిటీ & రూరల్‌లోనే 4.38 లక్షల బాటిళ్లు సీజ్ అయ్యాయి. వినూత్నంగా స్మగ్లింగ్ చేస్తున్నప్పటికీ పోలీసులు వారిని గుర్తిస్తున్నారు.

News March 4, 2025

58.35 గంటల ముద్దుతో రికార్డ్.. విడిపోయిన జంట

image

ఒకటీ రెండు కాదు 58Hr పాటు ముద్దు పెట్టుకుని గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన ఇక్కాచాయ్-లక్సానా జంట షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల విడాకులు తీసుకున్నట్లు ప్రకటించింది. అయితే ఇందుకు గల కారణాలను వెల్లడించలేదు. ఈ థాయ్‌లాండ్ కపుల్ 2013లో 58 గంటల 35 నిమిషాల 58 సెకన్లపాటు ముద్దు పెట్టుకుని ప్రపంచ రికార్డు సృష్టించింది.

error: Content is protected !!