News October 6, 2025
అద్దె ఇంటికీ వాస్తు చూడాలా?

వాస్తు శాస్త్రం సొంత గృహాలతో పాటు అద్దె ఇళ్లకు కూడా వర్తిస్తుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ఏ ప్రాంతంలో నివసించేవారైనా వాస్తును అనుసరిస్తే ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. నివాస స్థలంలో తగిన వాస్తు విధానాలు పాటించడం ద్వారా తక్కువ రోజుల్లోనే శుభ ఫలితాలు కలుగుతాయని అంటున్నారు. స్థల యాజమాన్యం కంటే అందులో నివసించే వ్యక్తి పొందే సానుకూల శక్తే ప్రధానమని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>
Similar News
News February 16, 2026
కార్మికులకు పింఛను సౌకర్యం

రోజువారి కూలీలతో జీవనం సాగించే కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం శ్రమ యోగి మాన్ ధన్ యోజన పింఛన్ పథకాన్ని అమలు చేస్తోంది. 18 నుంచి 40 సంవత్సరాల లోపు వారు ఇందుకు అర్హులు. వయసును బట్టి నెలకు ప్రీమియం రూ. 55 నుంచి 200 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 60 సంవత్సరాల అనంతరం నెలవారి రూ. 3 వేలు పింఛను వస్తుంది. లబ్ధిదారుడు మృతి చెందితే జీవిత భాగస్వామికి 50% పింఛన్ చెల్లిస్తారు.
News February 16, 2026
బిల్‌గేట్స్.. అమరావతికి ఆహ్వానం(PHOTOS)

AP: మైక్రోసాఫ్ట్ ఫౌండర్, గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్‌గేట్స్ అమరావతి పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు నారా లోకేశ్ సహా మంత్రులంతా ఘన స్వాగతం పలికారు. అనంతరం సచివాలయం వద్ద సీఎం చంద్రబాబు ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని వెల్కమ్ చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు పైన గ్యాలరీలో చూడవచ్చు.
News February 16, 2026
జొన్నలో కాండం తొలుచు పురుగు.. నివారణ

జొన్న పంట వేసిన 35 రోజుల నుంచి కాండం తొలుచు పురుగు ఆశిస్తుంది. దీని నివారణకు ఎకరానికి 4 కేజీల కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలను కాండం సుడుల్లో వేయాలి. * కత్తెర పురుగు లార్వా దశలో ఉంటే వేపనూనె(అజాడిరక్టిన్) 1500 పిపిఎం 5 ML లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. * పురుగు తీవ్రత అధికంగా ఉంటే క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 ML, ఒక లీటరు నీటికి కలిపి సుడుల్లో పడేలా పిచికారీ చేయాలి.


