News August 4, 2024
కేసు ఉన్నా ఉద్యోగం నుంచి తొలగించకూడదు: హైకోర్టు

AP: క్రిమినల్ కేసు ఉన్న ఉద్యోగిని ఉద్యోగం నుంచి తీసేయడానికి వీల్లేదని హైకోర్టు తీర్పునిచ్చింది. అధికారిక విధులు నిర్వర్తించడానికి కేసు ఏమాత్రం అడ్డంకి కాదని స్పష్టం చేసింది. నేరం నిరూపణ అయ్యేవరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నిర్దోషే అని పేర్కొంది. విచారణ జరపకుండా శిక్ష విధించడం చెల్లదని తెలిపింది. ఓ అంగన్‌వాడీ వర్కర్‌ను కేసు నెపంతో ఉద్యోగం నుంచి తొలగించడంతో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Similar News
News April 13, 2026
పాత ఇంట్లో దొరికిన నాణెం.. వేలంలో ₹1.2కోట్లు

బ్రిటన్ చరిత్రలోనే అత్యంత అందమైన నాణెంగా పేరుగాంచిన ‘యూనా అండ్ ది లయన్’ గోల్డ్ కాయిన్ వేలంలో £110,000 (సుమారు ₹1.2 కోట్లు) పలికింది. వేల్స్‌లోని ఒక పాత ఇంట్లో దొరికిన ఈ ఐదు పౌండ్ల నాణేన్ని 1839లో క్వీన్ విక్టోరియా పట్టాభిషేక జ్ఞాపకార్థం ముద్రించారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి 300 మాత్రమే ఉండటంతో కాయిన్ కలెక్టర్స్ దీనిని నాణేల ప్రపంచంలో ‘హోలీ గ్రెయిల్’(అత్యంత అరుదైనది)గా భావిస్తారు.
News April 13, 2026
బోయర్ జాతి మేకల ప్రత్యేకతలు ఇవే..

ప్రపంచంలోనే అధిక మాంసోత్పత్తి, మాంసంలో కొవ్వు తక్కువగా ఉండటం వీటి ప్రత్యేకత. ఇవి సాధారణంగా తెల్లటి శరీరం, ఎర్రటి-గోధుమ రంగు తల, పొడవైన వంగి ఉండే చెవులు, వెనుకకు వంగిన బలమైన కొమ్ములు, పొట్టి కాళ్లు ఉంటాయి. మగ మేకలు ఏడాదిలో 70-80KGలు, రెండేళ్లలో 100KGలకుపైగా పెరుగుతాయి. ఇవి ఏ వాతావరణ పరిస్థితులనైనా తట్టుకొని, అధిక వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. మనదేశంలో చాలా మంది రైతులు వీటిని పెంచుతున్నారు.
News April 13, 2026
ఎరువుల వాడకంలో నిపుణుల సూచనలు

వేసవిలో భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాల ఆధారంగా సిఫార్సు చేసిన ఎరువులను వాడాలి. రసాయన ఎరువులతో పాటు సేంద్రియ, జీవన, పచ్చిరొట్ట పైర్ల ఎరువులను వాడటం వల్ల ఎరువుల సమతుల్యత జరిగి పంట దిగుబడి పెరుగుతుంది. నీటి నాణ్యత, పంటకాలం, పంటల సరళిని బట్టి ఎరువులను వేయాలి. సమస్యాత్మక భూముల్లో జిప్సం, సున్నం, పచ్చిరొట్ట ఎరువులు, సూక్ష్మపోషకాలను వేసి నేలలో లోపాలను సరిచేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు


