News September 24, 2025

బొప్పాయి, ఫైనాపిల్ గర్భిణులు తినకూడదా?

image

గర్భిణులు బొప్పాయి, పైనాపిల్ తింటే గర్భస్రావం జరుగుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే వాటికి దూరంగా ఉండాలంటుంటారు. అయితే ఇందులో వాస్తవం లేదని గైనకాలజిస్టులు చెబుతున్నారు. గర్భిణులు బాగా పండిన బొప్పాయి, పైనాపిల్ తినడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేస్తున్నారు. అపోహలను పక్కనపెట్టాలని సూచిస్తున్నారు. పచ్చి బొప్పాయి, పచ్చి పైనాపిల్ ఎక్కువగా తింటే మాత్రమే సమస్య ఉంటుందంటున్నారు.
#ShareIt

Similar News

News September 24, 2025

దసరా ఆఫర్.. డిస్కౌంట్లు ప్రకటిస్తున్న కంపెనీలు

image

దసరా నవరాత్రుల సందర్భంగా ఓలా కంపెనీ ఆఫర్లు ప్రకటించింది. ముహురత్ మహోత్సవ్ కింద S1 X 2kWh, Roadster X 2.5kW స్కూటర్లను రూ.49,999కే విక్రయిస్తున్నట్లు తెలిపింది. S1 Pro+ 5.2kWh, Roadster X+ 9.1kWh స్కూటర్ల రేట్లను రూ.99,999గా నిర్ణయించింది. అక్టోబర్ 1 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అటు జీఎస్టీ తగ్గింపు, దసరా ఆఫర్లతో బైకులు, కార్లు పెద్దఎత్తున అమ్ముడవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

News September 24, 2025

గాయత్రీ మాతగా వరంగల్ భద్రకాళీ దేవి

image

వరంగల్‌లోని భద్రకాళీ దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజున అమ్మవారు భక్తులను అనుగ్రహించడానికి గాయత్రీ మాతగా కనిపించనున్నారు. ఈ రోజున చంద్రఘంటా రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు. సాయంత్రం వేళల్లో సింహ, గజ వాహనాలపై ఊరేగింపు ఉంటుంది. నుదుటన చంద్రుడిని ధరించడంతో అమ్మవారిని చంద్రఘంట అని పిలుస్తారు. ఈరూపంలో అమ్మను దర్శించుకుంటే శత్రునాశనం ఉంటుందని నమ్మకం.

News September 24, 2025

ఎస్సీ, ఎస్టీ కేసులపై హైకోర్టు కీలక తీర్పు

image

AP: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో నిందితులు దాఖలు చేసే ముందస్తు బెయిల్ పిటిషన్ల విషయంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పోలీసులు నమోదు చేసిన FIRలో ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు లేకుంటే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఆ పిటిషన్‌కు విచారణ అర్హత ఉంటుందని తెలిపింది. ప్రాథమిక ఆధారాలు ఉంటే మాత్రం ముందస్తు బెయిల్‌పై నిషేధం ఉంటుందని పేర్కొంది.