News July 31, 2024
శాంసన్‌కు ఇంకా ఛాన్సులు ఇవ్వాలా?

టీమ్‌ఇండియా బ్యాటర్ సంజూ శాంసన్ ఇప్పటివరకు 26 అంతర్జాతీయ టీ20 మ్యాచులు ఆడారు. 19.30 సగటు, 131.36SR, 2 హాఫ్ సెంచరీలతో 444 రన్స్ చేశారు. గత ఏడాది నుంచి ఆడిన మ్యాచుల్లో 50+ స్కోరు ఒకటే(vsZIM) చేశారు. మిగతా మ్యాచుల్లో 5,12, 7, 13, 1, 40, 0, 12 రన్స్ చేసిన ఆయన, తాజాగా శ్రీలంకతో 2 మ్యాచుల్లో డకౌట్ అయ్యారు. మరి సంజూకి ఇంకా కొన్ని మ్యాచుల్లో ఛాన్స్ ఇవ్వాలని మీరు అభిప్రాయపడుతున్నారా? కామెంట్ చేయండి.
Similar News
News April 2, 2026
గుండెల మీద ఆడించిన తండ్రే.. కర్కశంగా చంపేశాడు!

AP: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో ఉంటానని కూతురు చెప్పడాన్ని తండ్రి తట్టుకోలేకపోయాడు. ఆమె గుండెలపై కూర్చొని ఊపిరాడకుండా చేసి, ఆపై ఉరేసి చంపాడు. మాచర్లకు చెందిన చౌడేశ్వరి(22), అదే మండలానికి చెందిన నాగరాజు గత నెల 4న ఇల్లు విడిచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులకే మాట్లాడుకుందామని పెద్దలు వారిని మాచర్ల తీసుకురాగా 18న హత్య జరిగింది. పోలీసులు నిన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
News April 2, 2026
రాముడి లుక్‌కు ఫిదా.. VFXపై నెటిజన్ల భిన్నాభిప్రాయాలు!

నితేశ్ తివారీ ‘రామాయణ’ <<19543549>>టీజర్‌పై<<>> SMలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది. ‘ఆదిపురుష్’ కంటే బెటర్ అని కొందరు.. అంతా ఏఐ వీడియోలా ఉందంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో VFX క్వాలిటీ, గ్రాఫిక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.
News April 2, 2026
ప్రధాని మోదీతో మంత్రి లోకేశ్ భేటీ

ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత బిల్లుకు ఆమోదం నేపథ్యంలో ప్రధాని మోదీతో మంత్రి లోకేశ్ ఢిల్లీలో భేటీ అయ్యారు. PMను మంగళగిరి శాలువాతో సత్కరించి, ధన్యవాదాలు తెలిపారు. లోకేశ్‌కు కూడా మోదీ కంగ్రాట్స్ చెప్పారు. అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను లోకేశ్ కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.


