News July 12, 2024

చంద్రబాబును కాపాడేందుకు ఇంత దిగజారిపోవాలా షర్మిల?: వైసీపీ

image

AP: హామీలను అమలుచేయని చంద్రబాబును కాపాడేందుకు ఇంతలా దిగజారిపోవాలా? అని APCC చీఫ్ షర్మిలను వైసీపీ ప్రశ్నించింది. ‘2019 మేనిఫెస్టోలో ఏముందో నీకు తెలియదా? ఇచ్చిన మాటమేరకు దాన్ని అమలు చేయడం ప్రజలు చూడలేదా? అమ్మకు వందనంపై మోసపూరిత GOను ప్రశ్నించడం మాని YCPపై <<13615198>>నిందలా?<<>> YSR విగ్రహాల విధ్వంసంపైనా మీరు నోరు మెదపలేదు’ అని Xలో ఫైరయ్యింది.

Similar News

News December 9, 2025

BREAKING: తూ.గో జిల్లాలో స్కూల్ పిల్లల బస్సు బోల్తా

image

తూ.గో జిల్లాలో తెల్లవారుజామున పెనుప్రమాదం తప్పింది. పెరవలిలోని తీపర్రు వద్ద ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది పిల్లలు ఉండగా వారు సురక్షితంగా బయటపడ్డారు. బస్సుకు బ్రేక్ ఫెయిల్ కావడం వలనే ప్రమాదం జరిగినట్లు సమాచారం.

News December 9, 2025

USలో లోకేశ్ పర్యటన.. కీలక భేటీలు

image

AP: అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్ రిగెట్టి కంప్యూటింగ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డేవిడ్ రివాస్‌తో భేటీ అయ్యారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని కోరారు. అలాగే ఓమిమం సంస్థ చీఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్‌ చొక్కలింగం కరుప్పయ్యతోనూ ఆయన సమావేశమయ్యారు. ఏపీలో ఎలక్ట్రోలైజర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు.

News December 9, 2025

భారత్ బియ్యంపైనా టారిఫ్‌లకు సిద్ధమైన ట్రంప్

image

ఇండియా నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న బియ్యంపై కొత్త టారిఫ్‌లు విధించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. భారత్‌ బియ్యం తక్కువ ధరలకు వస్తున్నాయని, ఇది అమెరికన్ రైతులకు నష్టం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌తో పాటు కెనడా నుంచి వచ్చే ఎరువులపై కూడా కఠిన టారిఫ్‌లు విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే భారత వస్తువులపై US 50% <<18423577>>సుంకాల<<>>ను విధించింది.